Akira Nandan : ప‌వ‌న్ కుమారుడు అకీరా నంద‌న్ గురించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఇవే..!

November 22, 2022 3:59 PM

Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ ల ప్రేమకు గుర్తుగా జన్మించిన అకీరా నిత్యం ఏదో ఒక వార్తలో ఉంటున్నాడు. అకీరా నందన్ సినీ ఎంట్రీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇందుకు గల కారణం అకీరా తరచూ ఇప్పుడు పవన్ వెంట దర్శనం ఇవ్వడమే. పైగా తండ్రి పవన్ ని మించి పోయి 6ప్లస్ హైట్ తో సినీ హీరోని తలపిస్తున్నాడు. పబ్లిక్ లో కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు. అందుకే ఈ మెగా వారసుణ్ణి చూసి పవన్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

2004 ఏప్రిల్ 8నా అకీరా పుడితే 2009లో పవన్ కళ్యాణ్ రేణు దేశాల వివాహం జరిగింది. 2010 మార్చి 23 ఈ జంటకు ఆధ్య జన్మించింది. ఆ తరువాత 2012లో పవన్, రేణు విడిపోవడం ఇలా అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. పవన్ నుంచి  వేరుపడిన వెంటనే అకీరా, ఆధ్యలను తీసుకుని పూణే వెళ్లి , మరాఠీ సినీ ఇండస్ట్రీలో దర్శకురాలిగా స్థిరపడింది రేణు దేశాయ్.

Akira Nandan interesting facts
Akira Nandan

పవన్ కళ్యాణ్ తో విడాకులు తర్వాత తన కొడుకు, కూతురు ప్రాణంగా బతుకుతోంది రేణు దేశాయ్. ఆ ఇద్దరికీ సంబంధించిన అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ వారి కెరీర్ కి మంచి బాటలు వేస్తోంది. అకీరా ప్రస్తుతం తను ఉన్నత చదవటం చదువు కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాడు. ఇక అసలు విషయానికొస్తే రేణు అకిరా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

పూణేలో అకీరాకు ఫ్రెండ్స్ తక్కువే. రేణు మేనల్లుడు తో అకీరా ఎక్కువ క్లోజ్ గా ఉంటాడు. ఓరోజు అతడి స్కూల్ పుస్తకంపై హీరోయిన్ శిల్ప శెట్టి ఫోటో ఉండడంతో తట్టుకోలేకపోయిన అకీరా వెంటనే తల్లికి కంప్లైంట్ చేసాడు. రేణు తన మేనల్లునితో కలిసి స్కూల్ కి వెళ్లి, ప్రిన్సిపాల్ తో చెప్పి పెద్ద క్లాస్ పీకిందట. నైతిక విలువల పట్ల నిబద్దత గల అకీరా చదువుకునే పుస్తకాలపై ఇలా హీరోయిన్స్ బొమ్మలు ఉండడం భరించలేకపోయాడు. ఇప్పటినుంచే సమాజం, విలువలు అంటూ తండ్రి పవన్ బాటలో పయనిస్తున్న అకీరా భవిష్యత్ లో సామాజిక ఉద్యమకారుడు అవుతాడని ఇంటర్వ్యూ ద్వారా రేణు దేశాయ్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now