Lord Hanuman : చెడుశక్తులు పోవాలంటే ఇంట్లో ఎలాంటి హనుమాన్ ఫోటోని ఏ దిశగా ఉంచాలి..?

November 19, 2022 5:07 PM

Lord Hanuman : చాలామందికి ప్రధాన సమస్య చెడుశక్తుల వలన తమకు నష్టాలు, ప్రమాదాలు సంభివస్తున్నాయని భయపడుతుంటారు. ఇంకా కొంతమందికి అనారోగ్య సమస్యలు, చిన్నపిల్లలకు తరుచూ నిద్రలో ఏడవటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారందరూ హనుమంతుడికి సకల కష్టాలను నాశనం చేసే శక్తిగా పురాణకాలం నుంచి నమ్ముతారు. అంతేకాకుండా హనుమంతుడిని భక్తితో పూజిస్తే సంపన్నవంతులుగా ఉంటారని మరియు ప్రతి భయాందోళనల నుంచి బయటపడతారని నమ్ముతారు.

అంటే హనుమంతుడిని ధైర్యానికి ప్రతీక అని భావిస్తారు. దుష్ట శక్తులను పారద్రోలడానికి, సమస్త గ్రహ, భూతప్రేత పిశాచాదులను దూరం చేస్తారన్నది హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరి నమ్మకం. అయితే కొన్ని వాస్తు నియమాలను దృష్టిలో పెట్టుకుని ఆంజనేయస్వామి ఫొటోని మీరు ఇంట్లో ఉంచితే తప్పక మంచి జరుగుతుంది. ఆంజనేయ స్వామి పోటోని వాస్తు పరంగా ఏ దిశగా అమరిస్తే మనకు మంచి శుభాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Hanuman for evil which photo we have to put in home
Lord Hanuman

ఇంట్లో ఉత్తర దిశలో హనుమంతుని ఫొటో పెట్టడం వలన దక్షిణ దిశ నుంచి వచ్చే చెడు శక్తుల నివారణ జరుగుతుంది. ఆకాశమార్గంలో ఎగురుతున్న హనుమాన్ ఫొటోను పెట్టుకోవడం వల్ల దుష్టశక్తుల నివారణ త్వరగా జరుగుతుంది. వాస్తు ప్రకారం హనుమంతుని ఫొటోను దక్షిణ దిశ చూసే విధంగా అమర్చుకోవాలి. శక్తిని ప్రదర్శిస్తున్న ముద్రలో ఉన్న ఆంజనేయస్వామి ఫొటో వల్ల దుష్టశక్తులు ఇంటి దరిదాపుకు కూడా రావు.

హనుమాన్ ఫొటో ఇంట్లో ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఇంట్లో నివసించే వారి మధ్య పరస్పర ప్రేమవాతావరణం కూడా ఏర్పడుతుంది. భయం, ఆందోళన, చెడు ఆలోచనలు పోతాయి. ఇంట్లో హనుమంతుని ఫొటో పెట్టి పూజ చేసుకోవడం వల్ల సుఖం, ధనం, భయనివారణ జరుగుతాయి. వీలైతే రోజుకు ఒక్కసారి ఒక్క అగరువత్తి వెలిగించి స్వామి ముందు పెట్టి హనుమాన్‌చాలీసా చదివితే చాలు సమస్త గ్రహదోషాలు, పీడలు నుంచి బయటపడతారు .

కనీసం ఏడాదిలో ఒక మండలం రోజులైనా హనుమాన్ చాలీసా చదవితే పిల్లలకు భయనివారణ, ధైర్యసహసాలు, బలం, ఆయుష్షు వృద్ధి కలుగుతాయి. ప్రతీరోజు చాలీసా పారాయణం చేసేవారి జీవితంలో ఎటువంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొనే స్వభావం అలవడుతుంది. ఎలాంటి సమస్యలనైనా సులభంగా అధిగమించగలుగుతారని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు. శనివారం, సోమవారం, మంగళవారం రోజులలో మంచి తిథి, సమయం చూసుకుని గాలిలో ఎగురుతున్న  ఆంజనేయస్వామి ఫోటోని ఇంటిలో ఉత్తరదిశలో అంటే దక్షిణం చూసే విధంగా అమర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల సకల భయాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలుగుతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now