Jabardasth Shanthi Swaroop : జబర్ధస్త్ లేడీ గెటప్ లో కనిపించే శాంతి స్వరూప్ ఎవరు.. ఏ ఊరు.. ఆయన తండ్రి ఏం చేస్తారో తెలుసా..?

November 17, 2022 3:49 PM

Jabardasth Shanthi Swaroop : మల్లెమాల సంస్థ నిర్వహించే జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది వర్ధమాన నటులకు అవకాశం దక్కింది. జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది  కమెడియన్స్ ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన పంచ్ డైలాగులతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. దేశ విదేశాల్లో కూడా జబర్దస్త్ షో కమెడియన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారు చేసే స్కిట్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్స్ కి జీవితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.

రాకెట్ రాఘవ, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, చలాకి చంటి, షేకింగ్ శేషు లాంటి వారు సెలబ్రిటీలుగా మారిపోయారు. జబర్దస్త్ లో టీం లీడర్లు ఇప్పటికే పాపులర్ కాగా.. ముఖ్యంగా లేడీ గెటప్ లు వేసే వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జబర్ధస్త్ లో జడ్జీలు, యాంకర్స్ ఆడవారు ఉన్నారు కానీ.. మొదటి లో స్కిట్స్ చేసేటప్పుడు ఆడ గెటప్ లో మగవారే వేసుకొని చేస్తున్నారు. అందులో ముఖ్యంగా శాంతి స్వరూప్ గురించి ముందుగా చెప్పుకోవాలి.

Jabardasth Shanthi Swaroop who he is and other details
Jabardasth Shanthi Swaroop

శాంతి స్వరూప్ స్వగ్రామం నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో కొత్తూరు గ్రామం. తండ్రి పేరు రాఘవయ్య. శాంతి స్వరూప్ ది వ్యవసాయ కుటుంబం చదువు పూర్తికాగానే 1998 నుంచి 2001 వరకు ఎస్టీడీ బూత్ లో నెలకు వెయ్యి రూపాయల జీతానికి పనిచేశాడు శాంతి స్వరూప్. చిత్ర పరిశ్రమలోకి రావాలనే కోరికతో హైదరాబాద్ వచ్చాడు. మొదట జబర్ధస్త్ లో ఆఫీస్ బాయ్ గా చేరాడు. రాకెట్ రాఘవ, రచ్చరవిలతో పరిచయం పెంచుకొని చివరకు చమ్మక్ చంద్ర ద్వారా జబర్దస్త్ షోలో ప్రవేశించాడు. యాంకర్ సుమ మొదటగా శాంతి అని పేరున్న ఇతడికి శాంతి స్వరూప్ గా నామకరణం చేసిందట.

ఇక అలా మొదట చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్న సమయంలోనే హైపర్ ఆది టీమ్ లీడర్ కావడం.. ఆ టీమ్ లో లేడీ గెటప్ లు వేయడానికి అవకాశం ఇవ్వడంతో శాంతి స్వరూప్ క్రేజ్ బాగా పెరిగింది. ఇక శాంతి స్వరూప్ కు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. నితిన్ నటించిన లై, మనోజ్ నటించిన ఒక్కడు మిగిలాడు, ఎన్టీఆర్ నటించిన జైలవకుశ, నెల్లూరు పెద్దారెడ్డి వంటి సినిమాల్లో చిన్న పాత్రలలో అవకాశాలు దక్కించుకొని హాస్య నటుడు కావాలన్న తన కోరికను నెరవేర్చుకున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment