Anasuya : అనసూయకు ఆమె భర్త చేసిన‌ రెండు ప్రమాణాలు ఏంటో తెలుసా..?

November 16, 2022 8:02 AM

Anasuya : అందాల యాంకర్ అనసూయ గురించి తెలుగువారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన గ్లామర్ తో, మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ అందాల యాంకరమ్మ. పలు టీవీషోలలో యాంకర్ గా చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు సినిమా రంగంలో కూడా అడుగు పెట్టింది.  మంచి మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ వెండితెర మీద కూడా  రాణించింది. అనసూయకు సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా బాగా కలిసొచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రంగమ్మత్తగా ప్రేక్షకులను మెప్పించింది.

రంగస్థలం సినిమాలో అనసూయ రంగమ్మత్తగా మంచి నటనను కనబరచటంతో వరుస అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. పుష్ప చిత్రంలో కూడా దాక్షాయిని పాత్రలో ప్రేక్షకులను అనసూయ నటనతో మెప్పించింది. అనసూయ అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ  మంచి పాత్రలను కంగారు పడకుండా ఎంచుకుంటుంది. ఇక అనసూయ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే  భరద్వాజ్‌ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకుంది.  2010 ఫిబ్రవరి 10న అనసూయ కాస్తా అనసూయ భరద్వాజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Anasuya husband did two promises to her know them
Anasuya

ఇటీవల అనసూయ తన 38వ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవటానికి భర్త, కుటుంబంతో కలిసి మాల్దీవ్స్ వెళ్ళింది. ఈ సందర్భంగా  తన భర్త శశాంక్ భరద్వాజ్ ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది అనసూయ. ప్రేమ, అన్యోన్యంగా ఉండటం గురించి, చిన్న చిన్న లోపాలను అర్ధం చేసుకోవటం గురించి 17 సంవత్సరాల క్రితం నాకు ప్రామిస్ చేసావు. అప్పుడు నేను మాత్రమే ఉన్నాను. 8 సంవత్సరాల క్రితం ఇదే రోజు నా కోసం వీటి గురించి ప్రపంచానికి ప్రామిస్ చేసావు. హ్యాపీ 8 లవ్ అంటూ అనసూయ భర్త కోసం ట్వీట్ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now