Business For Women : ఆర్థికంగా కుటుంబానికి సపోర్ట్ గా ఉండాల‌నుకుంటున్నారా.. మ‌హిళ‌ల‌ కోస‌మే.. అద్భుత‌మైన బిజినెస్ ఐడియా..

November 12, 2022 11:43 AM

Business For Women : మారుతున్న జీవనశైలి బట్టి కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితి  వస్తుంది. ఉద్యోగ బాధ్యతల రీత్యా కనీసం తిండి తినడానికి కూడా ప్రస్తుతరానికి సమయం దొరకటం లేదని చెప్పవచ్చు. పిల్లలతో ఆడుకోవడం కూర్చుని కబుర్లు చెప్పడానికి కూడా కొంత మందికి సమయం ఉండటం లేదు. పెరుగుతున్న ఇంటి బాధ్యతలు  మీద ఉన్న దృష్టితో ఆర్థికంగా స్థిరపడటం కోసం అన్ని సంతోషాలను వదులుకుంటున్నారు. ముఖ్యంగా తిండి తినే విషయంలో కూడా అశ్రద్ధ  చూపుతున్నారు. చాలా మంది బయట ఆహారానికి అలవాటు పడి అనారోగ్యాల బారిన పడటం మనం చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు అలాంటి వారి కోసమే కొన్ని సర్వీసులు అందుబాటులోకి కూడా వచ్చాయి. హోం ఫుడ్ అంటూ కొందరు నగరాల్లో ఆహారం అందించే కార్యక్రమాలు చేపట్టారు. సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులు కనీసం మంచి ఫుడ్ ని వాళ్ళ కోసం రెడీ చేసుకునే సమయం లేక ఎక్కువగా జోమాటో, స్విగ్గి, ఫుడ్ ఫండా వంటి యాప్స్ మీద ఆధారపడుతున్నారు. అయితే ఈ సదవకాశాన్ని గృహిణులు చక్కగా వినియోగించుకోవచ్చు అని చెబుతున్నారు కొంతమంది బిజినెస్ పర్సన్స్. ఎలా అంటే..  మీకు వంట రుచిగా వండటం వస్తే చాలు. మీకున్న పరిచయాల ద్వారా  ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని  మొదలుపెట్టవచ్చు.

Business For Women in telugu start today good opportunity to earn money
Business For Women

మీరు కూడా ఇంటి ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టుకోవాలి అనుకుంటే ఇంట్లో కాళీగా ఉండకుండా ఒక  30 మందికి బ్రేక్ఫాస్ట్ గాని, భోజనం గాని చేసి దానిని మీకు ఉన్న పరిచయాల ద్వారా దగ్గరలోని కంపెనీలకు అందించవచ్చు.  ఒక డెలివరి బాయ్ ని పార్ట్ టైం గా పెట్టుకోవడమో లేకపోతే మీరే స్వయంగా వెళ్లి ఇన్ని ఆర్డర్లు అని తీసుకుని వారికి ఆహారాన్ని అందించాలి. మీ చుట్టుపక్కల కంపెనీలు లేనివారు అయితే శుభకార్యాలకు మరియు ఇతర కార్యక్రమాలకు గుడ్ డెలివరీ  సేవలను అందించడం ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.

ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాల్లో అయితే ఈ వ్యాపారం కొందరు మొదలుపెట్టి విజయవంతంగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో కాళీగా ఉండే మహిళలకు ఈ వ్యాపారం బాగుంటుంది అని ఫుడ్ డెలివరీ బిజినెస్ చేస్తున్నవారు చెప్తున్నారు.  హోం మేడ్ ఫుడ్ కూడా కాబట్టి మీ వద్ద నాణ్యత ఉంటే వ్యాపారం పది కాలాల పాటు కొనసాగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ కుటుంబానికి ఆర్థికపరంగా సపోర్ట్ గా నిలవాలి అనుకునే మహిళలకు ఫుడ్ డెలివరీ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now