Shriya Saran : ఈ వ‌య‌స్సులోనూ వ‌న్నె త‌గ్గ‌ని అందం.. మ‌ళ్లీ అందాల ఆర‌బోత చేసి రెచ్చ‌గొడుతున్న శ్రియ‌.. వీడియో..

November 10, 2022 9:53 AM

Shriya Saran : టాలీవుడ్‌తోపాటు హిందీ, త‌మిళ సినీ ఇండ‌స్ట్రీల‌లోనూ త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్న న‌టి.. శ్రియా శ‌ర‌న్. ఈమె వ‌య‌స్సు పెరుగుతున్నా అందం మాత్రం అలాగే ఉంది. అలాగే సినిమాల్లో అవ‌కాశాలు కూడా అధికంగానే వ‌స్తున్నాయి. దీంతో ఈ బ్యూటీ ప్ర‌స్తుతం బిజీగా మారింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాల్లోనూ ఈమె యాక్ట్ చేస్తోంది. మ‌రోవైపు పెళ్ల‌యి ఒక కుమార్తె ఉన్న‌ప్ప‌టికీ శ్రియ అందాల ప్ర‌ద‌ర్శ‌న మాత్రం ఆప‌డం లేదు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఒక యాడ్ ద్వారా అందాల‌ను ఆర‌బోసింది.

శ్రియ తాజాగా చేసిన ఓ యాడ్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. అందులో ఆమె ష‌వ‌ర్ కింద నిల‌బ‌డి అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ వేడి నీటితో స్నానం చేస్తుండ‌డం విశేషం. ఈ వీడియోను ఆమె త‌న ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయ‌గా.. అది అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. శ్రియ ఇలా గ్లామ‌ర్ షో చేస్తుండ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆ వీడియో ఒక యాడ్ కంపెనీకి చెందిన‌ది కాగా.. ఈ వ‌య‌స్సులోనూ యాడ్స్‌ను చేజిక్కించుకుంటుండ‌డంతో అంద‌రూ షాక‌వుతున్నారు. సాధార‌ణంగా శ్రియ లాగా పెళ్ల‌యి పిల్ల‌లు ఉన్న హీరోయిన్స్ కు సినిమాల్లోనే కాదు.. యాడ్స్‌లోనూ అంత‌గా అవ‌కాశాలు రావు. కానీ ఈమెకు వ‌స్తున్నాయి అంటే.. ఈమె అందాల ప్ర‌ద‌ర్శ‌న ఆ రేంజ్‌లో ఉంద‌న్న‌మాట‌.

Shriya Saran latest commercial ad video viral
Shriya Saran

ఇక ఈ యాడ్‌తో తాను సినిమాల్లో ఈ త‌ర‌హా పాత్ర‌లు చేయ‌డానికి కూడా రెడీ అయ్యాన‌ని శ్రియ చెప్ప‌క‌నే చెప్పింద‌ని అంటున్నారు. మ‌రి ఈమె లేటెస్ట్ వీడియోతో మ‌రిన్ని మూవీల్లో చాన్స్‌లు వ‌స్తాయో రావో చూడాలి. ఇక శ్రియ ఆర్ఆర్ఆర్ మూవీలో క‌నిపించింది. అలాగే దృశ్యం 2 హిందీ రీమేక్‌లోనూ యాక్ట్ చేసింది. ఈమ‌ధ్యే నానాప‌టేక‌ర్‌తో క‌లిసి ఓ మూవీ చేయ‌గా.. అది ఓటీటీలో రిలీజ్ అయింది. ఇలా శ్రియ ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now