చేప తలను తినకుండా పడేస్తున్నారా.. దాంతో ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిస్తే పడేయరు..!

November 6, 2022 7:43 AM

మాంసాహారం తినేవారిలో చాలా మంది చేపలను ఇష్టంగా తింటుంటారు. చేపల్లో అనేక రకాలు ఉంటాయి. ఎవరైనా సరే తమ స్థోమత, అభిరుచులకు అనుగుణంగా చేపలను తెచ్చుకుని తింటుంటారు. చేపలతో చాలా మంది వివిధ రకాల వంటకాలను వండుతుంటారు. చేపల వేపుడు, పులుసు ఇలా చేస్తుంటారు. అయితే చేపలను ఎంతో మంది ఇష్టంగా తిన్నప్పటికీ చేప తలను మాత్రం ఎవరూ తినరు. కొందరు మాత్రమే వీటిని ప్రత్యేకంగా కట్‌ చేయించి మరీ తింటారు. అయితే పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం.. చేప తలలు మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని అసలు పడేయకూడదు. చేప తలలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. చేపల కన్నా చేప తలల్లోనే పోషకాలు అధికంగా ఉంటాయని అంటున్నారు.

do not throw away fish heads you should take them for these benefits

చేపల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే చేప తలలో ఇంకా ఎక్కువ ప్రోటీన్లు లభిస్తాయి. కనుక చేప తలను తప్పక తినాలి. చికెన్‌, మటన్‌ ల కన్నా ఎక్కువ ప్రోటీన్లు చేప తలలో మనకు లభిస్తాయి. దీంతో శక్తి వస్తుంది. కండరాల నిర్మాణం జరుగుతుంది. కండరాలు ఉత్తేజంగా మారుతాయి. ఎంత సేపు పనిచేసినా అలసిపోరు. నీరసం, ఒత్తిడి, అలసట వంటివి తగ్గుతాయి. రోజంతా నీరసంగా ఉందని, చిన్న పనికే అలసిపోతున్నామని భావించేవారు చేప తలను తినాలి. దీంతో ఆయా సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా నీరసం, అలసట దరి చేరవు. కాబట్టి చేప తలను ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక చేప మిగిలిన భాగంలో కన్నా చేప తలలోనే అధికంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. దీంతో హార్ట్‌ ఎటాక్‌లు రావు. బీపీ కూడా తగ్గుతుంది. అలాగే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఙాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. డిప్రెషన్‌ నుంచి బయట పడతారు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు చేప తలను తింటే ఫలితం కనిపిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాలను తింటే కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ కూడా తగ్గుతాయి. దీంతోపాటు బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. గుండె అసాధారణ రీతిలో కొట్టుకునే వారు చేప తలను తింటే సమస్య తగ్గుతుంది. ఇందులోని పొటాషియం హార్ట్‌ బీట్‌ను కంట్రోల్‌ చేస్తుంది. కనుక గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. దీంతో బీపీ కూడా తగ్గుతుంది.

విటమిన్‌ ఎ వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా విటమిన్‌ ఎ రక్షిస్తుంది. అయితే చేప తలలో విటమిన్‌ ఎ మనకు పుష్కలంగా లభిస్తుంది. అందువల్ల అనేక లాభాలను పొందవచ్చు. దీన్ని తినడం వల్ల కంటి చూపు స్పష్టంగా ఉంటుంది. భవిష్యత్తులో కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా కళ్లలో శుక్లాలు రావు. చేప మిగిలిన భాగంతో పోల్చితే చేప తల ఎంతో బలవర్ధకమైన ఆహారం. కనుక దీన్ని తప్పక తీసుకోవాలని.. దీంతో అనేక లాభాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చేప తలను తప్పక తినాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now