India Post Office Recruitment 2022 : పోస్టాఫీస్‌లలో 98వేల ఉద్యోగాలు.. 10వ తరగతి, ఇంటర్‌ చదివితే చాలు.. ఆకర్షణీయమైన జీతం..

November 6, 2022 7:45 AM

India Post Office Recruitment 2022 : దేశంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు భారతీయ పోస్టల్‌ విభాగం భారీగా ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది. కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారతీయ పోస్టల్‌ విభాగం వారు దేశ వ్యాప్తంగా ఆయా సర్కిల్స్‌లో ఖాళీగా ఉన్న మొత్తం 98వేల ఉద్యోగాలకు నియామక ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే పోస్ట్‌ మెన్‌ ఉద్యోగాలు 59099 ఉండగా, 1445 మెయిల్‌ గార్డ్స్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. వీటికి పదవ తరగతి లేదా ఇంటర్‌ చదివి ఉంటే చాలని తెలిపారు.

ఈ ఉద్యోగాలకు గాను 10వ తరగతి లేదా ఇంటర్ పూర్తి చేసిన లేదా ఈ సంవత్సరం పూర్తి చేయబోతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే పోస్ట్‌మెన్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారు టెన్త్‌ లేదా ఇంటర్‌ను ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి చదివి ఉండాలి. అలాగే మెయిల్‌ గార్డ్‌ ఉద్యోగాలకు కూడా టెన్త్‌ లేదా ఇంటర్‌ చదివి ఉండాలి. వీరు బేసిక్‌ కంప్యూటర్‌ స్కిల్స్‌ను కూడా కలిగి ఉండాలి. ఎంటీఎస్‌ ఉద్యోగాలకు కూడా టెన్త్‌, ఇంటర్‌ విద్యార్హలతోపాటు కంప్యూటర్‌ స్కిల్స్‌ను కూడా కలిగి ఉండాలి.

India Post Office Recruitment 2022 over 98000 vacancies 10th and 12th salary details
India Post Office Recruitment 2022

మొత్తం 98083 ఉద్యోగాల్లో 59099 ఉద్యోగాలు పోస్ట్‌మ్యాన్‌ విభాగంలో ఉండగా, మెయిల్‌ గార్డ్‌ విభాగంలో 1445 ఖాళీలు, మల్టీ టాస్కింగ్‌ (ఎంటీఎస్) విభాగంలో 37539 ఖాళీలు ఉన్నాయి. వయస్సు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, వికలాంగులకు వయస్సులో 3 నుంచి 15 ఏళ్ల వరకు మినహాయింపులు ఉంటాయి. అలాగే జీతం రూ.33718 నుంచి రూ.35370 మధ్య ఉంటుంది. రీజన్‌ వారిగా చూసుకుంటే ఏపీలో 2289 పోస్ట్‌ మ్యాన్‌ ఉద్యోగాలు, 108 మెయిల్‌ గార్డ్‌ పోస్టులు, 1166 ఎంటీఎస్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో 1553 పోస్ట్‌ మ్యాన్‌ ఉద్యోగాలు, 82 మెయిల్‌ గార్డ్‌ ఉద్యోగాలు, 878 ఎంటీఎస్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

జనరల్‌ కేటగిరికి చెందిన అభ్యర్థులు రూ.100 అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, ఎస్‌సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ట్రాన్స్‌వుమన్‌ అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్‌ రుసుమును చెల్లించాల్సిన పనిలేదు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే వారు www.indiapost.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలి. హోమ్‌ పేజీఇలో ఇండియా పోస్ట్‌ రిక్రూట్‌మెంట్‌ 2022 అనే ఆన్ లైన్‌ ఫామ్‌పై క్లిక్‌ చేయాలి. నోటిఫికేషన్‌ లింక్‌ ఓపెన్‌ చేసి అంతా బాగా చదవాలి. తరువాత అప్లికేషన్‌ లింక్‌ను క్లిక్‌ చేస్తే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి రిజిస్టర్‌ చేయాలి. తరువాత సబ్‌మిట్‌ బటన్‌ను నొక్కాలి. దీంతో అప్లికేషన్‌ సబ్‌మిట్‌ అవుతుంది. మరిన్ని వివరాలకు పైన తెలిపిన వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now