Usiri Deepam : కార్తీక మాసంలో ఉసిరి దీపం తప్పక వెలిగించాలి.. ఏం జరుగుతుందో తెలుసా..?

October 31, 2022 3:49 PM

Usiri Deepam : కార్తీక మాసంలో ప్రతి సోమవారం భక్తులు అనేక పూజలు చేస్తుంటారు. ఉదయం సూర్యుడు రావడానికి ముందే స్నానపానాదులు ముగించి దీపం పెడతారు. అలాగే ఉదయాన్నే శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేస్తారు. అయితే కార్తీక సోమవారం రోజు ఉసిరి దీపం పెడితే ఎంతో మేలు జరుగుతుంది. దీని గురించి పురాణాల్లోనూ వివరించారు.

కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం వల్ల ఏడు జన్మల్లో చేసిన పాపాలు పోతాయట. అలాగే లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు. ఉసిరి దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతోపాటు అదృష్టం కూడా కలసి వస్తుంది. దీంతోపాటు ఇంట్లోని వారందరి సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. ఆరోగ్యం చక్కబడుతుంది. ఏమైనా దోషాలు ఉంటే పోతాయి. దుష్టశక్తుల నుంచి విముక్తి లభిస్తుంది. కనుక ఈ మాసంలో ఉసిరి దీపాన్ని తప్పక పెట్టాలి.

Usiri Deepam we must lit this in karthika masam know what happens
Usiri Deepam

ఇక ఈ మాసంలో ఉసిరి దీపం పెట్టడం వెనుక సైన్స్‌ కూడా ఉంది. ఎలాగంటే.. ఈ సీజన్‌లో చాలా మందికి దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. అలాంటి సమయంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. ఉసిరి మనకు ఆ శక్తిని అందిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల విటమిన్‌ సి అధికంగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్‌ వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇలా కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం వల్ల మనం రెండు రకాలుగా లాభాలను పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now