Deeparadhana : దీపారాధన చేస్తున్నారా.. అయితే ఎట్టి పరిస్థితిలోనూ ఈ పొరపాట్లు చేయవద్దు..

October 30, 2022 6:22 PM

Deeparadhana : కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. భక్తులు రోజూ పూజలు చేస్తుంటారు. ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడు రాకముందే దీపం పెడుతుంటారు. ఈ మాసం మొత్తం అలాగే చేస్తారు. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున దీపాలను వెలిగిస్తుంటారు. దీంతో సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. అయితే దీపారాధన విషయంలో కొందరు కొన్ని తప్పులు చేస్తుంటారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టీల్‌ కుందులో దీపారాధన చేయరాదు. ఎట్టి పరిస్థితిలోనూ మట్టితో చేసిన కుందులనే వాడాలి. అలాగే అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు. ఒక వత్తి దీపాన్ని చేయరాదు. దీన్ని చనిపోయిన వారి దేహం వద్ద వెలిగిస్తారు. కనుక ఇలా చేయకూడదు. దీపాన్ని అగర్‌బత్తీతో మాత్రమే వెలిగించాలి.

if you are doing Deeparadhana in karthika masam follow these rules
Deeparadhana

దీపారాధన కుందికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షతలు వేయాలి. విష్ణువుకు దీపారాధన చేస్తే దీపాన్ని ఆయన కుడివైపు ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు. అలాగే దీపం కొండెక్కితే 108 సార్లు ఓం నమఃశివాయ అని జపించి మళ్లీ దీపం వెలిగించాలి. ఇలా ఈ మాసంలో దీపారాధన విషయంలో జాగ్రత్తలను పాటించాలి. దీంతో ఈశ్వరుడి కరుణా కటాక్షాలను పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now