వామ్మో..సురేష్ బాబుకే టోపీ పెట్టిన కేటుగాడు.. అసలేం జరిగిందంటే?

June 22, 2021 6:20 PM

టాలీవుడ్ ఇండస్ట్రీ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన సురేష్ బాబు చివరికి ఓ కేటుగాడి వలలో పడి పెద్ద ఎత్తున మోసపోయాడు.నిర్మాత సురేష్ బాబుకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి అతని దగ్గర కరోనా వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయని చెబుతూ సురేష్ బాబు దగ్గర నుంచి లక్షల రూపాయలను కాజేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓ గుర్తు తెలియని వ్యక్తి తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని సురేష్ బాబు ఆఫీసుకు ఫోన్ చేశాడు. దీంతో అది నిజమేనని భావించిన సురేష్ బాబు మేనేజర్ అతని దగ్గర నుంచి కరోనా వ్యాక్సిన్ లను పొందటానికి అతనికి లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు.

సురేష్ బాబు మేనేజర్ అతని ఖాతాకు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అతను కాంటాక్ట్ లో లేడు.సురేష్ బాబు మేనేజర్ ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ అటువైపు వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం తో వారు మోసపోయానని గ్రహించి వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now