Hyper Aadi : ఒకప్పటి సామాన్యుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు.. హైపర్ ఆది ఇల్లే రూ.10 కోట్లట..!

October 26, 2022 8:42 PM

Hyper Aadi : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఇండస్ట్రీలో సెలబ్రెటీలుగా కొనసాగుతున్న వారిలో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన హైపర్ ఆది ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నారు. దీంతో ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన హైపర్ ఆది ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాల్లో తన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

షో ఏదైనా ఆది ఉంటే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అన్న బ్రాండ్ నేమ్ తెచ్చుకున్నారు. బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ ఆదికి సినిమా ఆఫర్స్ తెచ్చిపెట్టింది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆది మేడ మీద అబ్బాయి, తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, వెంకీ మామ, సోలో బ్రతుకే సో బెటర్.. ఇలా దాదాపు 20 చిత్రాల వరకు చేశాడు. మరికొన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి. నటుడిగా, యాంకర్ గా ఆది కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. మరి ఇంతలా చెలరేగిపోతున్న ఆది సంపాదన ఎంత? ఆయన ఎన్ని ఆస్తులు కూడబెట్టాడనే? సందేహం అందరి మదిలో మెదులుతుంది.

Hyper Aadi assets you will be surprised to know
Hyper Aadi

అందుతున్న సమాచారం ప్రకారం హైపర్ ఆది సంపాదన లక్షల నుండి కోట్లకు చేరిందట. సినిమాలు, బుల్లితెర షోలతో ఆయన రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం ఆది హైదరాబాద్ లో కొనుగోలు చేసిన ఇంటి ఖరీదే రూ. 10 కోట్ల వరకు ఉంటుందట. అలాగే ఆది ఒంగోలు దగ్గర్లో గల సొంతూరిలో బాగా స్థిరాస్తులు కొన్నారట. జబర్దస్త్ కి రాకముందు మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆది ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడనేది టాక్. ఒక కామెడీ షో ఆయన జీవితాన్నే మార్చేసింది. సామాన్యుడిని స్టార్ ని చేసిందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now