Sri Reddy : కొర‌మీను చేప‌ల కూర వండిన శ్రీ‌రెడ్డి.. రుచి ఎలా ఉందో చెప్పేసింది.. వీడియో..!

October 23, 2022 7:39 PM

Sri Reddy : ప్ర‌స్తుత త‌రుణంలో సోష‌ల్ మీడియా ప్ర‌భావం ప్ర‌జ‌ల‌పై ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు.. రాత్రి నిద్రించే వ‌ర‌కు అంద‌రూ అందులోనే విహ‌రిస్తున్నారు. కాల‌క్షేపం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చాలా మంది సోష‌ల్ మీడియాను ఆదాయ వ‌న‌రుగా కూడా చేసుకుంటున్నారు. ఇక న‌టీన‌టులు కూడా త‌మ వీడియోల‌ను అందులో పెడుతూ డ‌బ్బులు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో శ్రీ‌రెడ్డి ముందు ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈమె టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉద్య‌మం ద్వారా ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయింది. త‌రువాత క‌నిపించ‌కుండా పోయింది. కానీ యూట్యూబ్ ద్వారా మ‌ళ్లీ నెటిజ‌న్ల‌ను అల‌రిస్తోంది.

శ్రీ‌రెడ్డి ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో చేస్తున్న ర‌చ్చ మామూలుగా ఉండ‌డం లేదు. ర‌క‌ర‌కాల వంట‌ల‌ను వండుతూ అందాల విందు చేస్తూ అల‌రిస్తోంది. ఇప్ప‌టికే అనేక ర‌కాల వంట‌ల‌ను వండిన శ్రీ‌రెడ్డి తాజాగా కొర‌మీను చేప‌ల‌ను వండింది. త‌న‌దైన శైలిలో పంచ్‌లు విసురుతూ క‌బుర్లు చెబుతూ చేప‌ల‌ను వండింది. దీంతో ఆమె వండిన కూరను చూస్తుంటే నోట్లో నీళ్లూరుతున్నాయంటే న‌మ్మండి. ఇక శ్రీ‌రెడ్డి ఈమ‌ధ్య కాలంలో సినీ సెల‌బ్రిటీల‌పై పెద్ద‌గా విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు. కానీ ద‌గ్గుబాటి సురేష్ బాబు కుమారుడు అభిరామ్‌పై మాత్రం విమ‌ర్శ‌ల‌ను ఎక్కు పెడుతోంది.

Sri Reddy cooked korameenu fish curry viral video
Sri Reddy

అభిరామ్ త్వ‌ర‌లోనే తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న అహింస అనే మూవీతో మ‌న ముందుకు రానున్నాడు. దీంతో ఆయ‌న‌పై శ్రీ‌రెడ్డి ప్ర‌స్తుతం సంచ‌ల‌న కామెంట్స్ చేస్తోంది. ఇక ఇటీవ‌లే ప‌వ‌న్ మీద కూడా దారుణంగా విమ‌ర్శ‌లు చేస్తూ బూతులు తిట్టేసింది. ప‌వ‌న్ ఓ కార్య‌క్ర‌మంలో భాగంగా వైసీపీ నాయ‌కుల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిట్టారు. దీంతో ప‌వ‌న్‌ను శ్రీ‌రెడ్డి కూడా అంతే రేంజ్‌లో తిట్టింది. దీంతో ఆమె వీడియో వైర‌ల్ అయింది. కాగా ప్ర‌స్తుతం శ్రీ‌రెడ్డి చెన్నైలో ఉంటూ యూట్యూబ్‌లో వంట‌ల ద్వారా అల‌రిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now