నాగార్జున ది ఘోస్ట్ మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

October 22, 2022 11:49 AM

అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ దసరా కానుకగా 5న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించగా, ఈ సినిమాలో నాగ్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే ఈ అవుట్ అండ్ అవుట్ హై ఓల్టేజ్ యాక్ష‌న్ మూవీ ద‌స‌రా పండ‌గ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. నాగార్జున ఈ మూవీతో సూప‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకోవాల‌ని తెగ ముచ్చ‌ట ప‌డ్డాడు.

విడుదలకు ముందు రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మూవీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే చిరంజీవి గాఢ్ ఫాధర్ చిత్రంతో పోటీపడిన ఈ మూవీ మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ది ఘోస్ట్ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు సమాచారం. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు అనే విషయాన్ని అఫీషియల్ గా చెప్తూ.. నవంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది.

nagarjuna the ghost movie coming on ott know the details

ఇక ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ మరియు పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ఘోస్ట్‌లో నాగార్జున మరింత స్టైలీష్‌గా కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌ల్లోనూ నాగ్ కొత్తగా కనిపించాడు. సోనాల్ చౌహాన్ చేసిన స్టంట్స్ అదిరిపోయాయి. అయితే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. థియేటర్ లో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఘోస్ట్ ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now