Mahesh Babu : అంత పెద్ద స్టార్ అయినా మ‌హేష్ బాబు వివాహం ఎందుకు అంత సింపుల్‌గా జ‌రిగింది..?

October 23, 2022 4:20 PM

Mahesh Babu : టాలీవుడ్‌లో మహేష్ బాబు, నమ్రత చూడచక్కని జంట. టాలీవుడ్ లోని బ్యూటిఫుల్ కపుల్స్ ఎవరు అనే ప్రశ్న వస్తే మహేష్ బాబు నమ్రత ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరిదీ అన్యోన్యమైన దాంపత్యం ఎంతో మంది సినీ తారలకు ఆదర్శంగా నిలుస్తుంది. వంశీ చిత్రం సమయంలో మొదలైన వీరి ప్రేమ కథ ఆ తర్వాత వివాహ బంధానికి దారితీసింది. నమ్రత ఎప్పుడు మహేష్ బాబుకు ఎంతో సపోర్టివ్ గా ఉంటారు. సినిమాలకంటే ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్  ఇస్తూ  వివాహం తర్వాత సినీ జీవితానికి స్వస్తి చెప్పారు నమ్రత.

మహేష్ బాబు కూడా చాలా సందర్భాలలో తనకు నమ్రత ఎక్కువగా సపోర్ట్ చేస్తుందని, తాను తీసుకునే ఆహారం నుండి ప్రతి విషయం ప‌ట్ల న‌మ్ర‌త‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని మహేష్ బాబు తెలిపారు. తాను ఈ స్థానంలో ఉండటానికి న‌మ్ర‌త‌నే కార‌ణం అంటూ భార్య గురించి ఎంతో చక్కగా మహేష్ బాబు అనేక ఇంటర్వ్యూల్లో తెలియజేశారు. ఇక వీరిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు నమ్రత వంశీ అనే సినిమాలో కలిసి నటించారు. వంశీ సినిమా 2000 సంవత్సరంలో విడుదలైంది.

why Mahesh Babu and Namrata married in simple way
Mahesh Babu

ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే నమ్రత,  మహేష్ బాబు ప్రేమలో పడ్డారు. మొదట వీరి వివాహానికి మహేష్ బాబు తండ్రి కృష్ణ నిరాకరించారని అప్పట్లో వార్తలు ప్రచారమయ్యాయి. హీరోయిన్ ను పెళ్ళి చేసుకోవడం కృష్ణ‌కు ఇష్టం లేదని అప్పటిలో బాగా టాక్ వినిపించింది. అంతేకాకుండా నమ్రత తెలుగు అమ్మాయి కాకపోవడం వల్ల కృష్ణ మహేష్ బాబుతో నమ్రత పెళ్లికి నిరాక‌రించార‌ని వార్త‌లు ప్రచారమయ్యాయి.

చివరికి సూపర్ స్టార్ కృష్ణను మహేష్ బాబు ఒప్పించారని ప్రచారం కూడా జరిగింది. ఇక నమ్రత మహేష్ బాబుల వివాహం 2005లో చెన్నైలో చాలా సింపుల్ గా కేవలం కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరిగింది. అయితే దీనికి కారణం కూడా మహేష్ బాబు తండ్రి కృష్ణ పెళ్ళికి ఒప్పుకోక పోవడమే అని అప్పట్లో టాక్ వినిపించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now