Jiobook 4g : వ‌చ్చేసింది.. జియో 4జి ల్యాప్‌టాప్‌.. ధ‌ర రూ.15వేలే..!

October 21, 2022 12:52 PM

Jiobook 4g : టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో మ‌రో సంచ‌ల‌నానికి వేదికైంది. ఇప్ప‌టికే టెలికాం సేవ‌ల ద్వారా ఎన్నో ల‌క్ష‌ల మంది వినియోగ‌దారుల మ‌న్న‌న‌లు పొందిన జియో మ‌రో సంచ‌ల‌నాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. కేవ‌లం రూ.15వేల‌కే ఓ నూత‌న 4జి ల్యాప్‌టాప్‌ను జియో లాంచ్ చేసింది. దీన్ని ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు. ఇక ఇప్పుడు ఇది వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. దీన్ని జియో ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

జియోబుక్ 4జి పేరిట రిల‌య‌న్స్ జియో ఓ నూత‌న ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఇందులో 4జి సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. ఆండ్రాయిడ్ ఆధారిత జియో ఓఎస్ ఆధారంగా ఇది ప‌నిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 662 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 11.6 ఇంచుల డిస్‌ప్లే ఉంది. వైఫై, బ్లూటూత్ ఫీచ‌ర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో 2 మెగాపిక్స‌ల్ వెబ్ క్యామ్ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. దీంతో 8 గంట‌ల‌కు పైగానే బ్యాకప్ వ‌స్తుంది.

Jiobook 4g android laptop launched by jio
Jiobook 4g

ఈ ల్యాప్‌టాప్‌లో 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్ వంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే మైక్రోసాఫ్ట్ యాప్స్ వస్తాయి. ఆండ్రాయిడ్ యాప్స్‌ను కూడా వాడుకోవ‌చ్చు. జియో బుక్ 4జి ల్యాప్‌టాప్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్‌లో మాత్ర‌మే విడుద‌ల కాగా దీని ధ‌ర రూ.15,799గా ఉంది. రిల‌య‌న్స్ డిజిట‌ల్‌తోపాటు జియో ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ల్యాప్‌టాప్ ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now