Anu Emmanuel : అను ఇమ్మాన్యుయెల్‌ను పెళ్లి చేసుకోనున్న అల్లు శిరీష్‌..? క్లారిటీ ఇచ్చేశారు..!

October 20, 2022 9:37 PM

Anu Emmanuel : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ గౌరవం చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా, శిరీష్ ఖాతాలో ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. 2019లో వచ్చిన ABCD సినిమాతో డిజాస్టర్ అందుకున్న అల్లు శిరీష్ కొన్ని నెలలపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత మళ్ళీ ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. విజేత ఫేమ్ రాకేష్ శశి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా నవంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తో తాను డేటింగ్ లో ఉన్నాడంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు అల్లు శిరీష్. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఊర్వసివో రాక్షసివో సినిమా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ అండ్ శిరీష్ లు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారనే వార్త సోషల్ మీడియా జోరుగా ప్రచారం అయ్యింది.

Anu Emmanuel and Allu Sirish are going to marry know what is the truth
Anu Emmanuel

ఈ మూవీ పోస్టర్ అండ్ టీజర్ లో రొమాన్స్ ఓ రేంజ్ లో ఉండడంతో, టాలీవుడ్ లో మరో కొత్త జంట సెట్ అయ్యిందని సినీ వర్గాల్లో కూడా టాక్ మొదలైంది. దీంతో తాజాగా స్పందించిన శిరీష్ ఆ రూమర్స్ ను కొట్టి పడేశాడు. సినీ తారలపై ఇలాంటి రూమర్స్ క్రియేట్ అవడం సహజమేనని చెప్పిన శిరీష్, గతంలో ఇలాంటి రూమర్స్ తనపై చాలానే వచ్చాయన్నాడు. అను ఇమ్మాన్యుయేల్‌ కి, తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని, ప్రస్తుతం తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని అల్లు శిరీష్ తేల్చి చెప్పాడు. ఈ మూవీలో సునీల్, వెన్నెల కిషోర్, కేదార్ శంకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో అయినా శిరీష్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment