Dhanraj : జబర్దస్త్ లో రోజుకి లక్ష ఇస్తే ఆ డబ్బులన్నీ అక్కడ పెట్టాను.. ధన్ రాజ్..

October 18, 2022 6:27 PM

Dhanraj : బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీలో అడుగుపెట్టి కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. వారిలో చాలామంది హీరోలుగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అందులో ధనరాజ్ కూడా ఒకడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ధన్ రాజ్ ఎన్నో సినిమాల్లో నటించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఇలా సినిమాలు, టీవీ షోస్ లో సందడి చేస్తూ ప్రేక్షకులను నవ్వించిన ధనరాజ్ హీరోగా మారిపోయాడు.

జబర్దస్త్ లో పనిచేసే టైంలో ధనరాజ్ మంచి ఫేమ్ తెచ్చుకున్నాక ఒక ఎపిసోడ్ కి దాదాపు లక్ష రూపాయాలను రెమ్యూనరేషన్ గా తీసుకునేవాడట. అలా సంపాదించిన డబ్బును బాగా సన్నిహితుడైన సాయి అచ్యుత్ చిన్నారి అని డైరెక్టర్ తో సినిమా చేయడానికి పెట్టుబడిగా పెట్టాడు. అలా ధనలక్ష్మి తలుపు తడితే సినిమాకు నిర్మాతగా మారాడు. ఒకవేళ సినిమా పోతే అనే ఆలోచన లేదంటూ పోయినా.. జబర్దస్త్, ఇంకా చేతి నిండా సినిమాలు ఉన్నాయి సంపాదించుకోవచ్చు అనే ధైర్యంతో నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. ఇక సినిమాలో శ్రీముఖి హీరోయిన్, జులాయి సినిమాలో తనని చూసిన డైరెక్టర్ తాను హీరోయిన్ అయితే బాగుంటుందని తీసుకున్నాడు.

Dhanraj says he lost money whether he earned from jabardasth
Dhanraj

సినిమా రిలీజ్ అయ్యాక వారం రోజులు సినిమా ఉంటుంది అని థియేటర్లతో ఒప్పందం చేసుకుని విడుదల చేయగా మొదటి 2 రోజులు కొన్ని థియేటర్స్ లో టికెట్స్ దొరకలేదు. ఆ సమయంలో శ్రీ ముఖి ఫోన్ చేసి టికెట్స్ కావాలని అడిగింది. వారం రోజులు సినిమా బాగానే ఆడినా ఆ తరువాత బాహుబలి సినిమా రావడంతో థియేటర్ లో మా సినిమా తీసేసారు. వారం రోజులకే అగ్రిమెంట్ ఇవ్వడం వల్ల అదీకాక బహుబలిలాంటి సినిమా వచ్చినపుడు మనమే తప్పుకోవాలి అనిపించింది. అలా సినిమా బాగున్నా నష్టపోయాను కానీ నేను అసలు వాటి గురించి ఆలోచించి డబ్బు పెట్టలేదు. ఒకవేళ అదే డబ్బు భూమి మీద పెట్టుంటే ఇప్పుడు కోట్లు అయ్యుండేది అంటూ తన చేదు అనుభవాలను పంచుకున్నాడు ధన్ రాజ్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now