Kantara Movie : పావలా పెట్టుబడికి పది రూపాయల లాభం.. కాంతారా మూవీతో అల్లు అరవింద్ కి పంట పండినట్టే..

October 17, 2022 12:46 PM

Kantara Movie : కాంతారా మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ప్రస్తుతం దుమ్ములేపుతోంది. ఏకంగా కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ మూవీల రికార్డులను సైతం బ్రేక్ చేస్తోంది. ఐఎండీబీలో కేజీఎఫ్ -2 మూవీకి 8.4 రేటింగ్ రాగా, కాంతారా మూవీకి ఏకంగా 9.5 రేటింగ్‌తో అదరగొడుతోంది. కన్నడ సంచలనం రిషబ్ శెట్టి ఇందులో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించాడు. కన్నడలో ఇటీవల రిలీజ్ అయిన కాంతారా చిత్రం అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

క్రిటిక్స్ అయితే ఈ మూవీతో లవ్ లో పడిపోయినట్టు కామెంట్స్ చేశారు. దీంతో మార్నింగ్ షోలు ఈవెనింగ్ షోలు డల్ గా స్టార్ట్ అయినా ఈవెనింగ్ షోల నుండి తిరుగు లేకుండా పోయింది. కాంతార చిత్ర తెలుగు హక్కులను నిర్మాత అల్లు అరవింద్ కొన్నారు. ఈ క్రమంలో ఆయన భారీ ఎత్తున లాభాలు గడించనున్నారు. కాంతార రైట్స్ కేవలం రూ. 2 కోట్లకు కొన్నట్లు సమాచారం. మొదటిరోజే ఈ మూవీ రూ. 2 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ. 5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సెకండ్ డే ఓపెనింగ్ డేకి మించి వసూళ్లు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఫుల్ రన్ లో కాంతార రూ. 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేయవచ్చనేది ట్రేడ్ వర్గాల అంచనా.

Kantara Movie Allu Aravind getting huge profits
Kantara Movie

మొత్తంగా అల్లు అరవింద్ డబ్బింగ్ మూవీతో పెట్టుబడికి ఐదారు రెట్ల లాభం పొందనున్నారు. ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనాలను నమోదు చేస్తుంది. థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కాంతార క్లైమాక్స్ గురించి ప్రస్తావించకుండా ఉండలేరు. ఇప్పటికే కన్నడలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, తెలుగు లో కూడా అదే మాదిరిగా విజయఢంకా మోగిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now