Golden Fish : జాలరికి చిక్కిన అరుదైన చేప.. దాని ఖరీదు లక్షల్లోనే..!

October 14, 2022 9:35 PM

Golden Fish : కచిడి.. నిజంగా బంగారం లాంటి చేపే.. వలలో పడిందా లక్షల రూపాయలు వచ్చినట్టే. ఆహారంగా ఆడ చేపలు అద్భుతమైన రుచిని అందిస్తే.. ఇక మగ చేపలు ఔషధాల తయారీలో ఖరీదైన వైన్‌ను శుభ్రం చేయడంతో పాటు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో కచిడి చేపకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. గోదావరి జిల్లాల్లో కనిపించే ఈ చేప మత్స్యకారులకు సిరులు కురిపిస్తోంది. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ జాలరి పంట పండింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్రతీరంలో ఉప్పాడకు చెందిన మత్స్యకారుడు వల వేయగా.. 18 కేజీల మగ కచిడి చేప చిక్కింది.

దీనికి వేలం పాటలో 2,90,000 రూపాయల ధర పలికింది. ఇది చాలా పెద్ద మొత్తం. దాదాపు మాములు చేపలు 5, 6 నెలలు అమ్మితే వచ్చే అమౌంట్. దీంతో ఆ మత్స్యకారుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాధారణంగా మగ కచిడి చేప ఉదరభాగంలో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అందుకే ఈ చేపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. వ్యాపారులు దీన్ని దక్కించుకునేందుకు పోటీ పడతారు. ఇలాంటి చేపలు ఏడాదికి 4 పడ్డా, జాలర్ల పంట పండినట్లే అని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.

Golden Fish are catched in godavari river region
Golden Fish

ఈ కచిడి చేపను గోల్డెన్ ఫిష్‌గా అని కూడా అంటారు. దీని విలువ ఎక్కువగా ఉండటంతో ఆ పేరు వచ్చింది. ఆపరేషన్ అనంతరం వైద్యులు కుట్లు వేసే దారాన్ని వీటి నుంచే తయారు చేస్తారు. చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం సమయం గడిచే కొద్దీ శరీరంలో కలిసిపోతుంది. పులస లేదా కచిడి వంటి చేపలు దొరికితే రైతులకు పండగే. ఇవే అత్యధిక ధరను కలిగి ఉంటాయి. పుస్తెలు అమ్మైనా సరే.. పులస తినాలంటారని మీకూ తెలిసే ఉంటుంది. ఆ చేప టేస్ట్ అలాంటిది మరి. ఇక కచిడి ఏమో మెడిసిన్ కోసం వాడతారు. గోదావరి తీర ప్రాంతాల్లో దొరికే చేపల్లో వీటికే ఖరీదు ఎక్కువ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now