టేస్టీ.. క్రిస్పీ మటన్ కీమా బాల్స్ తయారీ విధానం..

June 21, 2021 3:11 PM

సాధారణంగా మనం చికెన్ లేదా మటన్ తో వివిధ రకాల రెసిపిలను తయారుచేసుకుని తింటాము. అయితే ఎంతో టేస్టీగా.. క్రిస్పీగా మటన్ కీమా బాల్స్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

*మటన్ బోన్ లెస్ అరకిలో

*ఉప్పు తగినంత

*అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు

*కొత్తిమీర తురుము

*కారం టేబుల్ స్పూన్

*పచ్చిమిర్చి ముక్కలు 2

*గరం మసాలా అర టీ స్పూన్

*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత

తయారీ విధానం

ముందుగా బోన్లెస్ మటన్ మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మటన్ మెత్తగా తయారైన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి,ఉప్పు, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు వేసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ విధంగా మటన్ ముక్కలను మెత్తని మిశ్రమంలా తయారు చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ పై డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత ఈ మటన్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నూనెలో వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా తయారైన కీమా బాల్స్ లోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయను చేర్చి తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now