Throat Pain : గొంతు నొప్పి నుంచి బ‌య‌ట ప‌డేసే అద్భుత‌మైన చిట్కాలు.. పాటించ‌డం మ‌రిచిపోకండి..

October 18, 2022 9:42 AM

Throat Pain : సీజన్ మారిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో సతమతమవుతుంటాం. అలాగే గొంతులో గర గర, గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి సమస్యల‌తో ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యలకు ప్రారంభంలోనే గుడ్ బై  చెప్పాలి అంటే ఈ ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి.

ఈ సీజన్ లో వచ్చే ఈ సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే చాలు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఈ సమస్యల నుండి బయట పడవచ్చు. గొంతు సమస్యల నుంచి బయటపడడానికి ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం.

Throat Pain follow these tips to get rid of it
Throat Pain

విశ్రాంతి లేని దగ్గుకి వెల్లుల్లి మంచి ఔషధంగా పనిచేస్తుంది. అందుకే వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది ఒక ప్రకృతి ఔషదం. దీన్ని రోజు ఉదయాన్నే ఉడక బెట్టుకొని లేక దంచి తిన్న సరే దగ్గు లేక గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. గొంతులో ఇన్ఫెక్షన్ ఉంటే గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి గార్గిల్ చేసుకోవాలి. ఇలా చేస్తే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

గొంతు నొప్పి నివారించడానికి ఇంకొక అద్భుతమైన చిట్కా ఏంటంటే పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కొంచెం వేడి చేసి అరచెక్క నిమ్మరసం, పావు టీస్పూన్ మిరియాల పొడి వేసి రెండు నిమిషాలు మరిగించాలి. మరిగిన ఈ నీటిని గ్లాస్ లో పోసి నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు అరస్పూన్ తేనె, 6 తులసి ఆకులను వేసి ఆ నీటిని తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాలను పాటిస్తే చాలా త్వ‌రగా గొంతు సమస్యలు తగ్గుతాయి. నిమ్మకాయ, మిరియాలు, తేనె, తులసిలో ఉండే లక్షణాలు తొందరగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ప్రతిరోజూ ఆవిరిపట్టడం ద్వారా గొంతు సమస్యలన్నింటికీ  కూడా మంచి ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి సరైన సలహా తీసుకోవడం ఉత్తమం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now