Garikapati : అనుష్క అందంపై గరికపాటి కొంటె వ్యాఖ్యలు.. ఆర్జీవీకి బుక్కైన గరికపాటి..!

October 13, 2022 6:06 PM

Garikapati : ఎంత పెద్ద పండితుడైన జీవితంలో ఒక్కొక్కసారి చిన్న విషయాలకు కూడా విమర్శలను ఎదుర్కొనవలసి ఉంటుంది. దీనికి ఎటువంటి వారైనా అతీతులు కారు. ప్రస్తుతం ఆ విధంగానే విమర్శలను ఎదుర్కొంటున్న పండితుడు శ్రీ గరికపాటి నరసింహారావు గారు. ప్రముఖ అవధానిగా పేరుగాంచిన ఈయన ఇటీవల బండారు దత్తాత్రేయ గారు నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి పట్ల అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడిన మాటలను చిరంజీవి అభిమానులే కాక సాధారణ వ్యక్తులు కూడా తీవ్రంగా ఖండించారు.

ఈ విషయం పట్ల మెగా అభిమానులు పెద్ద ఎత్తున గరికపాటి గారి మీద సోషల్ మీడియా వేదికగా యుద్ధం ప్రకటించారు. అయితే సద్దుమణిగింది అనుకున్న ఈ వ్యవహారంలో వివాదాస్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంటర్ అవడంతో ఈ విషయం మళ్లీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రాంగోపాల్ వర్మ గరికపాటి గారిని ఉద్దేశిస్తూ గత 2 రోజులుగా తీవ్రమైన పదజాలంతో ట్వీట్లు పెడుతున్నాడు. గతంలో గరికపాటి మాట్లాడిన కొన్ని వీడియోలను జతచేస్తూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ లు చేస్తున్నారు.

Garikapati
Garikapati

ఆ కోవలోనే ఆయన గరికపాటి గతంలో స్త్రీల పట్ల చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఆయన పద్మశ్రీని కూడా వెనక్కి తీసుకోవాలని కోరడం జరిగింది. ఇంకా ప్రముఖ హీరోయిన్ అనుష్క అందచందాల గురించి గరికపాటి, గతంలో మాట్లాడిన మాటల వీడియోను జత చేస్తూ ఆహా అడ్డడ్డే.. అంటూ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్ల బాణాలను సంధిస్తున్నాడు. అయితే ఎప్పుడు ఎవరి వైపు ఉంటారో, ఆయనకే తెలియని వర్మ చిరంజీవి పక్షాన మాట్లాడుతూ గరికపాటిని ఇంకా ఎన్ని రోజులు తన ట్వీట్లతో వేధిస్తారు అనేది వేచి చూడవలసిందే..

 

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now