Nayanthara : చిక్కుల్లో న‌య‌న్ దంప‌తులు.. ఆనందం కాసేపైనా నిల‌వ‌లేదే..!

October 11, 2022 11:48 AM

Nayanthara : నయనతార తల్లైన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మలయాళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా మారిన నయనతార తర్వాత దక్షిణాదిలోని టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడి కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ భామ ఈ ఏడాది జూన్ నెలలో మహాబలేశ్వరంలో విగ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది. అయితే వీరి పెళ్లి జరిగి 4 నెలలు కూడా పూర్తి కాకుండానే తాము ఇద్దరం కవల పిల్లలకు జన్మనిచ్చామంటూ అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు. నయనతార ఈ మధ్య కూడా మీడియా కంట పడటం, అప్పుడు ఏమాత్రం గర్భంతో ఉన్న ఛాయలు కనిపించకపోవడంతో ఆమె సరోగసి ద్వారానే బిడ్డను కానీ ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతోంది.

ఈ విషయాన్ని ఇప్పటివరకు నయనతార కానీ విగ్నేష్ శివన్ కానీ అధికారికంగా ప్రకటించలేదు. సరోగసి ద్వారా పిల్లలు పొందిన వారిలో నయన్, విగ్నేష్ జంట మొదటి వారు కాదు. ప్రియాంక చోప్రా, మంచు లక్ష్మి, శిల్పా శెట్టి, కరణ్ జోహార్ లాంటి సీలెబ్రిటీలు అంతా సరోగసి విధానం ద్వారా పిల్లల్ని కన్నారు. అయితే ఈ ఏడాది జనవరి నెలలో సరోగసిని భారతదేశంలో బ్యాన్ చేశారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే సరోగసి ద్వారా బిడ్డలు కనేందుకు అనుమతులు ఇస్తూ ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా రూపొందించారు.

Nayanthara and Vignesh Shivan may face trouble
Nayanthara

ఈ నేపథ్యంలో 37 ఏళ్ల నయనతార సరోగసీ ద్వారా బిడ్డలు కనడానికి అర్హురాలు కాదని చెబుతూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీంతో ఈ విషయం మీద తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. నయనతార, విగ్నేష్ శివన్ ల సరోగసి ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా అనే విషయంలో ఆరోగ్య శాఖ విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్.. సరోగసిపై ప్రభుత్వానికి వివరాలు అందించాలని ఆదేశించారు. ఈ వివాదంపై నయన్, విగ్నేష్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now