Honey : రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ తేనెను ఇలా తీసుకోండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..

October 11, 2022 8:18 AM

Honey : ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. మారుతున్న ఆహారపు అలవాట్లు , జంక్ ఫుడ్స్ అధికంగా తినడం, శారీరక శ్రమ తగ్గడంతో భారీగా బరువు పెరుగుతున్నారు. అతి చిన్న వయసులోనే పెద్ద పొట్టతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద బాన లాంటి పొట్టను కరిగించి స్లిమ్‌గా కనిపించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. బానలాంటి పొట్టను తగ్గించుకోవడంలో తేనే పరమౌషధంలా పనిచేస్తుంది. తేనె అనేది ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన ఔషధాలలో ఒకటి. తేనె న్యాచురల్ తీయదనాన్ని కలిగి ఉండే ఒక జిగట ద్రవం. తేనె అనేది పువ్వులలో మకరందం నుండి లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లభించే ఆరోగ్యవంతమైన ఆహారాలలో తేనెను ఒకటిగా పేర్కొంటారు.

వివిధ ఔషధ విలువలు కలిగిన ఒక అద్భుత ఉత్పత్తి తేనె. తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, జింక్, సల్ఫర్, భాస్వరం, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు కలిగి ఉంటుంది. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రకాల పోషక విలువలు కలిగి ఉన్నాయి కాబట్టే తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు.

take one spoon Honey daily for these benefits
Honey

ఇంత శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండవు. మరి ఇన్ని పోషక విలువలు కలిగి ఉన్న అద్భుతమైన తేనెతో బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్ కొలెస్ట్రాల్ కరిగించడానికి సహాయపడతాయి. జీవక్రియను మెరుగుపరచి అధిక బరువును నియంత్రణలో ఉంచుతాయి.

ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీ స్పూన్ తేనెను ఒక కప్పు గోరువెచ్చని నీటిలో బాగా కలపాలి. దీన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో  తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయట పడవచ్చు. అంతే కాకుండా రోజూ ఒక టీ స్పూన్ తేనె తీసుకోవడం వలన రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. రక్తంలో తగినంత ఐరన్ లేనప్పుడు, మనిషికి అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. ఐరన్ లోపం వల్ల రక్తం ద్వారా మెదడు, గుండె వంటి భాగలకు ఆక్సిజన్ ను సరఫరా చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అందువలన నిత్యము తేనెను ఆహారంగా తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్య దరిచేరనివ్వదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now