Naga Chaitanya : ఆమె ఉసురే చైతన్య పాలిటశాపంగా మారిందా.. చెత్త పనితో అక్కినేని పరువు తీసాడుగా..!

October 11, 2022 8:21 AM

Naga Chaitanya : అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నాగ చైతన్య. హిట్లు, ప్లాప్ లు అని చూడకుండా వరుస సినిమాలను చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే కొంతకాలం క్రితం నాగ చైతన్యను ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఎప్పుడైతే సమంతతో లవ్ అంటూ పాపులర్ అయ్యాడో.. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఈయన పేరు మారుమ్రోగిపోతుంది. కొందరేమో హీరోయిన్ మొగుడుగా పాపులర్ అయ్యావంటారు.. కొందరేమో నీ తండ్రి పేరుతో పాపులర్ అయ్యావు అంటారు.

అయితే రీసెంట్ నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దానికి కారణం సినిమా షూటింగ్ ఆగిపోవడమే. నాగచైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ బైలింగ్వల్‌ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో గ్రాండ్ గా ప్రారంభమైంది. కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని మేలుకోట సమీపంలో రాజగోపురం దగ్గర మద్యం విక్రయ కేంద్రం సెట్ వేశారు. అయితే పవిత్ర ప్రదేశంలో ఇలా మద్యం సెట్ వేయడంపై అక్కడి స్థానికులు చిత్ర బృందంపై ఫైర్ అయ్యారు. అంతేకాదు సెట్ ని ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్న సినిమా సిబ్బందిని పరిగెత్తించి కొట్టారు.

Naga Chaitanya new movie shooting permission cancelled
Naga Chaitanya

ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగచైతన్య కూడా అక్కడే ఉన్నారని ఆయన కూడా పరుగులు పెట్టి అక్కడి నుంచి తప్పించుకున్నారని తెలుస్తుంది. నిజానికి షరతులతో చిత్రీకరణకు అనుమతి ఇవ్వగా చిత్ర యూనిట్ దాన్ని ఉల్లంఘించిందని స్థానిక కన్నడ సంఘ ప్రతినిధులు విమర్శించారు. దీంతో స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏది ఏమైనా సరే సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య టైం అస్సలు బాగాలేదని ఏది ముట్టుకున్న బ్లాస్టింగ్ అవుతుందని నెటిజన్స్ అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now