OTT : ఈ వారం ఓటీటీల్లో రానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

October 10, 2022 2:34 PM

OTT : ప్ర‌స్తుత త‌రుణంలో ఓటీటీల హావా నడుస్తుంది. పెద్ద పెద్ద సినిమాలు త‌ప్ప మిగతా త‌క్కువ బ‌డ్జెట్ సినిమాల‌న్నీ నేరుగా ఓటీటీల్లోనే విడుద‌ల అవుతున్నాయి. దానికి త‌గ్గ‌ట్టు ప్ర‌జ‌ల్లో కూడా ఓటీటీల ప‌ట్ల‌ ఆద‌ర‌ణ పెరుగుతోంది. ప్ర‌తి వారం థియేట‌ర్ల‌లో విడుద‌ల‌య్యే చిత్రాల‌కు దీటుగా ఓటీటీల్లో కూడా సినిమాలు, షో లు, సిరీస్ లు వ‌స్తూనే ఉన్నాయి. అలాగే ఈ వీక్ లో కూడా డిస్నీ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ప‌లు ఓటీటీల‌లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సినిమాలు, సిరీస్ ల గురించి తెలుసుకుందాం.

నంద‌మూరి బాల‌కృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాప‌బుల్ 1వ‌ సీజ‌న్ సూప‌ర్ స‌క్సెస్ సాధించింది. దీంతో రెండ‌వ సీజ‌న్ మ‌రింత ఆక‌ర్షించే విధంగా రాబోతుంది. మొద‌టి సీజ‌న్ కంటే ఎక్కువ ఫ‌న్, ఎక్కువ డేర్ ఉండ‌బోతున్నాయ‌ని చెబుతున్నారు. ఇక ఈ షో సెకండ్ సీజ‌న్ ఆహా ఓటీటీలో అక్టోబ‌ర్ 14 నుండి మొద‌లు కాబోతుంది.

మోడ్ర‌న్ ల‌వ్ డ్రామా గా చిత్రీక‌రించిన మిస్ మ్యాచ్డ్ సిరీస్ మొద‌టి సీజ‌న్ మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. ఇప్పుడు ఈ సిరీస్ 2వ సీజ‌న్ రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికపై అక్టోబ‌ర్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది.

movies and series releasing on 14th october 2022 on OTT
OTT

విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ డైరెక్ష‌న్ లో సైన్స్ ఫిక్ష‌న్, మిస్ట‌రీ, థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన చిత్రం దొబారా. తాప్సీ ప‌న్ను ఈ సినిమాలో ముఖ్య పాత్ర‌లో న‌టించింది. నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ పై అక్టోబ‌ర్ 15 నుండి హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో ఈ మూవీ ప్ర‌సారం కానుంది.

అలాగే అంజ‌లి లీడ్ రోల్ లో న‌టిస్తున్న ఝాన్సీ అనే సిరీస్, బెల్లంకొండ గ‌ణేష్ హీరోగా చేసిన స్వాతిముత్యం సినిమా, ద‌గ్గుబాటి రానా, వెంక‌టేష్ లు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన రానానాయుడు అనే వెబ్ సిరీస్, ఉపేంద్ర హీరోగా న‌టించిన క‌బ్జా చిత్రం, ఇలా ప‌లు సినిమాలు, సిరీస్ లు ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. అయితే వీటి యొక్క స్ట్రీమింగ్ తేదీల‌ను ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now