Chanakya Niti : ప్రాణ స్నేహితుడైన కానీ ఈ నాలుగు విషయాలను వారితో అస‌లు చెప్పవద్దు..!

October 10, 2022 1:07 PM

Chanakya Niti : చాణక్యుడు ఎంతో జ్ఞానం, ముందు చూపు కలిగిన వ్యక్తి. ఇప్పటి తరానికి ఎదురయ్యే ఎలాంటి సమస్యకైనా చాణిక్య నీతి ద్వారా జవాబు దొరుకుతుంది. చాణిక్యుడు ఆర్థికపరమైన, సామాజికపరమైన, వ్యక్తిగత పరమైన అంశాల గురించి చాణిక్య నీతి ద్వారా సమాజానికి తెలియజేశారు. చాణక్య నీతిలో జీవిత విధానాల గురించి ప్రస్తావించబడింది. చాణక్య నీతి విధానం ప్రకారం మీరు మీ స్నేహితులకు ఎప్పుడూ చెప్పకూడని కొన్ని విషయాల గురించి చాణిక్య నీతిలో చెప్పబడిన దాని గురించి తెలుసుకుందాం.

నీ స్నేహితుడిని బట్టి నీ గుణం ఎలాంటిదో తెలుస్తుందని చాణిక్యుడు చాణిక్య నీతి ద్వారా తెలియజేశారు. మనకు ఎలాంటి సమస్య వచ్చినా ముందు ఇంట్లోవారి కన్నా స్నేహితులతో ఎక్కువగా పంచుకుంటాం. కానీ స్నేహితుడికి కూడా చెప్పకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. ఎంత ప్రాణ స్నేహితుడైన కానీ చాణక్యుడి నీతి ప్రకారం వ్యాపారంలో నష్టం వచ్చినా, ఆర్థికంగా నష్టపోయినా ఆ విషయాల గురించి ఎంత ప్రాణ స్నేహితుడైన గానీ చెప్పకూడదు. ఇది తెలిసిన తరువాత స్నేహితులైనా సరే అతనికి సహాయం చేయడానికి భయపడతారు. అందువల్ల మీ జీవితంలో దీన్ని ఎల్లప్పుడూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.

Chanakya Niti do not share these 4 things with friend
Chanakya Niti

మీ భార్య లేదా స్నేహితురాలు అలవాట్ల గురించి అవతలి వ్యక్తికి చెప్పకండి. చాణక్యుడి నీతి ప్రకారం మనిషి తన విచారకరమైన విషయాలను కూడా రహస్యంగా ఉంచాలి. ఎందుకంటే మీ వ్యక్తిగత విషయాల గురించి చెప్పిన తర్వాత  ప్రజలు సంతోషంగా లేని వ్యక్తిని ఎగతాళి చేస్తారు. ఇతరుల ముందు మిమ్మల్ని అవమానించి మీ ప్రతిష్టను తగ్గించడానికి చూస్తూ ఉంటారు. మీ గురించి ఇత‌రుల‌తో చెప్ప‌డం ద్వారా ఎప్పుడో ఒక‌ప్పుడు మిమ్మ‌ల్ని అవ‌మానించ‌డానికి చూస్తుంటారు. ఎప్ప‌టికీ ఇలాంటి విష‌యాల‌ను ఇత‌రుల‌తో పంచుకోవ‌ద్దు.

అదేవిధంగా ఎటువంటి బాధ ఉన్నా కానీ మీరు ఎంత‌గానో న‌మ్ముతున్న వ్య‌క్తితో మాత్రం ఆ బాధ‌ను పంచుకోవ‌ద్దు. ఇలా పంచుకోవ‌డం వ‌ల్ల మీ స‌మ‌స్య‌కు సంబంధించిన విష‌యాల‌ను తెలుసుకుంటూ మీలో ఉన్న వీక్‌నెస్ ని పసిగడతారు. ఆ వీక్‌నెస్ తెలుసుకొని మీతో ఆడుకోవడం మొదలుపెడతారు. అందుకే ఎవ‌రినీ గుడ్డిగా న‌మ్మ‌వ‌ద్దు. అదేవిధంగా ఎవ‌రిని ఎంత‌వ‌ర‌కు న‌మ్మాలో అంత‌వ‌ర‌కు మాత్ర‌మే న‌మ్మాల‌ని చాణ‌క్యుడు చెప్పాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now