iPhone 14 Pro : ఐఫోన్ 14 ప్రొ.. రూ.23వేల‌కే ఫోన్‌ను కొనండిలా..!

October 10, 2022 10:46 AM

iPhone 14 Pro : ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ ఈ మ‌ధ్యే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ల‌ను లాంచ్ చేసిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే కొత్త ఐఫోన్లు వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తున్నారు. అయితే ఈ ఫోన్ల ధ‌రలు అధికంగానే ఉన్నాయి. కానీ అమెజాన్‌లో మాత్రం చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే ఈ ఫోన్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఏకంగా రూ.23వేల‌కే ఈ ఫోన్ల‌ను ద‌క్కించుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నారు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్ 14 ప్రొకు చెందిన 256 జీబీ వేరియెంట్ ధ‌ర రూ.1,39,900 ఉండ‌గా.. దీన్ని వినియోగ‌దారులు అమెజాన్‌లో రూ.23వేల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం కూడా ల‌భిస్తోంది. అయితే ఇందుకు గాను అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డును వాడాల్సి ఉంటుంది. దీంతోనే ఈ ఆఫ‌ర్ ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు ఐఫోన్ 14 ప్రొను రూ.23,317 కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అయితే ఇది నో కాస్ట్ ఈఎంఐ కింద మారుతుంది. క‌నుక మ‌రో 6 నెల‌ల పాటు నెల‌కు ఇంతే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇలా త‌క్కువ ధ‌ర‌కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

iPhone 14 Pro you can buy this phone at very low price
iPhone 14 Pro

అయితే ఈఎంఐ లేకుండా ఐఫోన్ 14 ప్రొను కొనుగోలు చేయాలంటే ఐసీఐసీఐ, యాక్సిస్‌, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల‌ను వాడాల్సి ఉటంఉంది. దీంతో రూ.1000 వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఏదైనా పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.15,750 వ‌ర‌కు డిస్కౌంట్ వ‌స్తుంది. దీంతో రూ.1,39,900 ఫోన్ కాస్తా రూ.1,23,150 అవుతుంది. ఇలా త‌గ్గింపు ధ‌ర‌కు ఈ ఫోన్‌ను కొన‌వ‌చ్చు. అలాగే ఇత‌ర ఫోన్ల‌పై కూడా స‌రిగ్గా ఇలాంటి ఆఫ‌ర్లే ల‌భిస్తున్నాయి. క‌నుక అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివల్‌లో త‌గ్గింపు ధ‌ర‌ల‌కే ఐఫోన్ల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

ఇక ఐఫోన్ 14 ప్రొ ఫోన్ లో 6.1 ఇంచుల సూప‌ర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, యాపిల్ ఎ16 బయానిక్ చిప్‌, 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా, క్విక్ చార్జింగ్ వంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ 128, 256, 512జీబీల‌తోపాటు 1టీబీ వేరియెంట్‌లోనూ అందుబాటులో ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now