Sobhan Babu : శోభ‌న్ బాబు, జ‌య‌ల‌లిత ప్రేమించుకున్నారా..? ఆయ‌న డైరీలో రాసుకున్న నిజాలు ఇవే..!

October 9, 2022 8:07 PM

Sobhan Babu : తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను సంపాదించుకున్న స్టార్ హీరోలలో శోభన్ బాబు ఒకరు. అధికంగా కుటుంబ కథ చిత్రాలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. ఈయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాలలో మంచి పేరు ఉన్న శోభన్ బాబు చదువు పూర్తయిన తరువాత సినిమాల మీద మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. శోభన్ బాబు మొదటిగా పొన్నులూరి బ్రదర్స్ నిర్మించిన దైవబలం చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం ఆశించిన మేరకు విజయం సాధించలేదు. ఆ తర్వాత భక్త శబరి చిత్రంలో నటించి సక్సెస్ ని అందుకున్నారు శోభన్ బాబు.

అప్పట్లో శోభన్ బాబు చిత్రాలు విడుదలవుతాయి అంటే చాలు మహిళా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు. శోభ‌న్ బాబు తెలుగుతోపాటు త‌మిళ ఇండ‌స్ట్రీలో కూడా రాణించారు. అయితే ఆ సమయంలో జ‌య‌లలిత, శోభ‌న్ బాబు ప్రేమ‌లో ఉన్నారంటూ వార్త‌లు బాగా వినిపించేవి. జ‌య‌లలిత, శోభ‌న్ బాబు హీరో హీరోయిన్ లుగా డాక్ట‌ర్ బాబు అనే సినిమాలో కలిసి నటించారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఒకే ఒక్క సినిమా డాక్టర్ బాబు.ఈ సినిమా షూటింగ్ కు కొన్ని రోజుల ముందు జ‌య‌లలిత త‌ల్లి మ‌ర‌ణించారట‌. ఆ త‌రువాత జ‌య‌ల‌లిత త‌న త‌ల్లిని శోభ‌న్ బాబులో చూసుకుంద‌ట‌. ఈ విష‌యాన్ని శోభ‌న్ బాబు స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూ ద్వారా వెల్లడించారు.

Sobhan Babu what he wrote about Jayalalitha in his diary
Sobhan Babu

డాక్ట‌ర్ బాబు సినిమా షూటింగ్ ఊటీలో జ‌ర‌గ‌గా శోభ‌న్ బాబు, జ‌యల‌లిత గురించి ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను త‌న డైరీలో రాసుకున్నారు. అమ్మ మరణంతో బ‌రువైన నా మ‌న‌సును నీ జోకుల‌తో తేలిక చేశావు. ప్ర‌పంచం అంతా కూడా ఇప్పుడు నిశ్చ‌లంగా క‌నిపిస్తోంది. అంద‌రితో మాట్లాడాల‌ని క‌లిసి ఉండాల‌ని అనిపిస్తుంద‌ని జ‌య‌ల‌లిత ఆయనతో చెప్పిన‌ట్టు శోభ‌న్ బాబు త‌న డైరీలో రాసుకున్నారు. అంతే కాకుండా నా త‌ల్లి మ‌ర‌ణించి సంవత్స‌రం కూడా కాలేదు. కానీ ఎన్నో సంవత్స‌రాలు అయిన‌ట్టు అనిపిస్తుంది.

నా అనుకున్న వాళ్లు నాకు ద్రోహం చేశారు. బంధువులు కేవలం నా డ‌బ్బు కోస‌మే ఉన్నారు. ఎవరిని నమ్మాలో ఎవ‌రిని నమ్మకూడదో తెలియ‌డం లేదు. ఇలా ఎన్నో బాధ‌ల‌కు మీరు వ‌చ్చాక విముక్తి క‌లిగింది అంటూ జ‌య‌ల‌లిత శోభన్ బాబుతో చెప్పినట్లు తన డైరీలో రాసుకున్నారు. దాంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఉంది ప్రేమ కాద‌ని ఒక త‌ల్లి బిడ్డ లాంటి అనుబంధం అని డైరీలో శోభన్ బాబు రాసుకున్న వాక్యాల‌ను బట్టి అర్థమవుతుంది.  కానీ వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లనే శోభన్ బాబు, జయలలిత ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now