Manchu Lakshmi : ఎవడి దూల వాడిది.. మనోజ్ రెండో పెళ్లిపై స్పందించిన మంచు లక్ష్మీ..!

October 9, 2022 2:01 PM

Manchu Lakshmi : గత కొన్ని రోజులుగా మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో అనేక విధమైన చర్చలు హాట్ టాపిక్ గా నిలిచాయి. మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారని, వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ విషయంపై మంచు మనోజ్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. తాజాగా మంచు మనోజ్, మౌనిక రెడ్డి రెండో పెళ్లి విషయంపై  మంచు లక్ష్మీ స్పందించింది.

ఈ అక్టోబర్ 8న మంచు లక్ష్మీ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించింది. ఈక్రమంలోనే మంచు మనోజ్ రెండో పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై మంచు లక్ష్మీ స్పందించి తమ్ముడి రెండో పెళ్లి మీద కౌంటర్లు వేస్తూ కామెంట్స్ చేసింది.  మనోజ్ పెళ్లి చేసుకుంటుంటే.. తానేం అంటానండీ బాబూ.. ఎవడి దూల వాడిది.. ఎవరి బతుకు వాళ్లని బతకనీయండి అని వెల్లడించింది. హానెస్ట్ లవ్‌ని తాను బ్లెస్ చేస్తానని చెప్పింది. ఈ విషయంపై తాను సంతోషంగానే ఉన్నానని చెప్పుకొచ్చింది.

Manchu Lakshmi responded on Manchu Manoj marriage
Manchu Lakshmi

జీవితంలో రెండే రెండు ఎమోషన్స్ ఉంటాయి. ఒకటి లవ్.. రెండు భయమని వెల్లడించింది. లైఫ్‌ని లవ్‌తో లీడ్ చేస్తున్నామా.. లేదా భయంతో లీడ్ చేస్తున్నామో తెలుసుకోవాలనీ, తన లైఫ్‌ని తాను లవ్‌తోనే లీడ్ చేస్తున్నాని చెప్పింది లక్ష్మీ. ఇక మంచు ఫ్యామిలీ మీద వస్తోన్న ట్రోలింగ్, మా అసోసియేష‌న్‌ రాజకీయాల మీద సైతం స్పందించింది. మా అంటే బుల్ షిట్.. ఒక పొలిటికల్ సిస్టమ్‌లో బురద జల్లుతూ ఉంటారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రంగలోకి దిగిన తరువాత మంచితోపాటు చెడుని కూడా యాక్సెప్ట్ చేయాలని ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసింది.

వాళ్లు నిన్ను చెడు అంటే నువ్వు చెడ్డోడివి అయిపోతావా ? ఈ ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకుని ఫీల్ అవుతారో.. ఎదుటి హీరోల గురించి ఎందుకు నెగిటివ్‌గా మాట్లాడతారో తెలియదని ఫ్యాన్ వార్ గురించి స్పందించింది. తామంతా అద్దాల మేడలోనే ఉంటామని.. రాళ్లు వేయడానికి రెడీగా ఉంటారని కౌంటర్లు విసిరింది. తాము ఇప్పటివరకూ మోహన్ బాబు బిడ్డలుగా.. ఎక్కడికి వెళ్లినా ప్రేమ అందుకోవడమే తెలుసు, కానీ ఈ నెగిటివిటీ ఎక్కడ నుంచి వస్తుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. జరుగుతున్న సంఘటనల ద్వారా తాము పాఠం నేర్చుకుంటున్నామని తెలివిగా జవాబిచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now