Nagarjuna : నాగార్జున గారూ.. ఇంక చాలు.. ఆపేయండి.. ఫ్యాన్స్ రిక్వెస్ట్‌..

October 8, 2022 7:31 AM

Nagarjuna : యువ సామ్రాట్‌, కింగ్ అక్కినేని నాగార్జున లేటెస్ట్‌గా ది ఘోస్ట్ మూవీతో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే అక్టోబ‌ర్ 5వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్ట‌డం లేదు. దీంతో నాగ్‌కు ఇంకో డిజాస్ట‌ర్ త‌ప్పేలా లేద‌ని సినీ విశ్లేష‌కులు అంటున్నారు. ఈ క్ర‌మంలోనే నాగార్జున‌కు ఆయ‌న ఫ్యాన్స్ ప్ర‌త్యేక విజ్ఞ‌ప్తులు చేస్తున్నారు. నాగార్జున ఇంక ఘోస్ట్ లాంటి సినిమాలు తీయ‌డం ఆపేయాల‌ని కోరుతున్నారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయాల‌ని కోరుతున్నారు.

నాగార్జున త‌న చిత్రాల ద్వారా ప్ర‌యోగాలు చేసేందుకు ఎల్ల‌ప్పుడూ ముందుంటారు. కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇస్తుంటారు. ఆయ‌న‌కు ఆ పేరుంది. అయితే ఆయ‌న గ‌త కొన్నేళ్ల‌లో కొత్త ద‌ర్శ‌కుల‌తో చేసిన ఎక్స్‌ప‌రిమెంట‌ల్ సినిమాలు అన్నీ ఫెయిల్ అయ్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు మాత్రమే స‌క్సెస్ అయ్యాయి. క‌నుక కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇచ్చినా స‌రే వారితో ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేయొద్ద‌ని.. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను మాత్ర‌మే చేయాల‌ని ఫ్యాన్స్ కోరుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయ‌నా.. బంగార్రాజు.. అలా చేసిన చిత్రాలే. క‌నుక అలా క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాతో ముందుకు వెళ్తే బాగుంటుంద‌ని.. నాగ్ ఫ్యాన్స్ ఆయ‌న‌కు రిక్వెస్ట్ చేస్తున్నారు.

fans request to Nagarjuna to stop experimental movies
Nagarjuna

ఇక నాగార్జున ఘోస్ట్ మూవీ గ‌తంలో ఆయ‌న తీసిన గ‌గ‌నం, వైల్డ్ డాగ్ చిత్రాల‌ను పోలి ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఘోస్ట్ మూవీ క‌థ బాగానే ఉన్నా.. ఇలాంటి క‌థ‌ల‌కు కాలం చెల్లింద‌ని.. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌నే ప్రేక్ష‌కులు బాగా ఆద‌రిస్తున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. అందుకు పుష్ప, ఇస్మార్ట్ శంక‌ర్ వంటి చిత్రాల‌ను ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్ప‌వ‌చ్చు. పూర్తి స్థాయి మాస్, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో సినిమా తీస్తే.. ప‌క్కా హిట్ అవుతుంద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. మ‌రి వారి కోరిక‌ను నాగార్జున మ‌న్నిస్తారో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now