Rashmi Gautam : హెల్ప్ చేయకపోయినా ఫ‌ర్లేదు.. ఆ పని మాత్రం చేయకండి.. రష్మీ ఎమోషనల్ పోస్ట్..

October 7, 2022 7:28 PM

Rashmi Gautam : బుల్లితెరపై యాంకర్‏గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రష్మీ గౌతమ్. చాలాకాలంగా ఎక్స్ ట్రా జబర్ధస్త్ షోకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి సైతం హోస్ట్ గా చేస్తుంది. చూడ చక్కని రూపంతోపాటు అదిరిపోయే హోస్టింగ్‌తో అలరిస్తోన్న ఈ భామ.. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి చాలాకాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఒకప్పుడు యాంకర్ రష్మీ బుల్లితెరపై ఫుల్ ట్రోలింగ్‌‌కు గురయ్యేది. ఆమె భాష, వస్త్ర‌ధారణ ఇలా అన్నింటి మీద నెగెటివ్ కామెంట్స్ వచ్చేవి.

కానీ క్రమేణా రష్మీ మంచితనం, సేవా కార్యక్రమాలు, ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ ఇవన్నీ కూడా ఆమెకు మంచి ఇమేజ్‌ను కట్టబెట్టాయి. సోషల్ మీడియాలో రష్మీ చేసే పోస్టులకు విపరీతమైన స్పందన వస్తుంది. అయితే రష్మీ కెరీర్ పరంగా ఎలా ఉన్నాకానీ పర్సనల్ గా చాలా సెన్సిటివ్. ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు కావచ్చు లేక పడిన బాధలు కావచ్చు రష్మీ మనసును సున్నితంగా మార్చేశాయి. రష్మీ పూర్తి శాకాహారి కనీసం పాలు కూడా తాగదు. ఎందుకంటే పాల కోసం మూగ జీవులను హింసిస్తారని చెప్పి తన వంతుగా పాలకు సంబంధించిన ఏ పదార్థాలను తీసుకోదు.

Rashmi Gautam emotional post of saying to save animals
Rashmi Gautam

పూర్తి శాకాహారి.. అంతేకాదు రష్మీ జంతు ప్రేమికురాలు. ఎక్కడైనా సరే జంతువులకు హాని కలిగించారంటే ఆమె అసలు ఊరుకోదు. అయితే తాజాగా రష్మీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనం మనుషులుగా పుట్టాం.. కనీసం హెల్ప్ చేయకపోయినా ఫ‌ర్లేదు హింసించకూడదు.. ప్రతి మనిషికి మూగజీవాలకి హెల్ప్ చేసేంత స్థోమత ఉండకపోవచ్చు. కానీ హింసించకుండా ఉండే మనసు మాత్రం ఉంటుంది. ప్లీజ్ దయచేసి మీరు మూగజీవాలకు హెల్ప్ చేయకపోయినా ఫ‌ర్లేదు కానీ హింసించకండి అంటూ చెప్పుకొచ్చింది. దీంతో రష్మీ పోస్ట్ అందరినీ ఆలోచింపచేస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now