Toe Nail Fungus : బాగా పుచ్చిన గోళ్లకు ఇది రాస్తే అందంగా తయారవుతాయి..!

October 7, 2022 4:53 PM

Toe Nail Fungus : మీ గోళ్ల ఆకృతి, రంగు మీ ఆరోగ్య పరిస్థితిని నిర్ధారిస్తుంది. డాక్టర్లు కొన్ని కొన్ని సమయాలలో కళ్ళు, నాలుకతోపాటు గోళ్లను చూసి మీ ఆరోగ్యం గురించి చాలా విషయాలు తెలుసుకుంటారు. అదేవిధంగా కొందరికి గోళ్లు పుచ్చిపోయి ఉంటాయి. దానికి అసలు కారణం ఏమిటనేది తెలియదు. కానీ గోళ్లు బాగా పుచ్చిపోయి నొప్పితో బాధ పడుతూ ఉంటారు. కొందరికైతే గోరు చుట్టు పక్కల భాగమంతా ఎర్రగా అయిపోతుంది. దానివలన భరించలేని నొప్పి కలుగుతుంది. ఇందుకోసం రకరకాల మందులు వాడినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కనిపించదు. మరికొందరికి విటమిన్స్ లోపం కారణమైతే, మరికొందరిలో బట్టలకు వాడే సబ్బులు లేక సర్ఫ్ వలన కూడా గోర్లు పుచ్చిపోతాయి. మరి పుచ్చిపోయిన గోళ్లను తిరిగి ఆరోగ్యం ఎలా మార్చుకోవాలో ఈ చిట్కా ద్వారా తెలుసుకుందాం.

ఈ చిట్కాతో గోళ్లు పుచ్చడం తగ్గి అందంగా తయారవుతాయి. దీనికోసం ముందుగా అయిదారు లవంగ‌ మొగ్గలను తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీ స్పూన్ లవంగాల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ గిన్నెను హీట్ లో స్టవ్ మీద పెట్టి ఐదు నుంచి పదినిమిషాల పాటు బాగా మరిగించాలి. లవంగాలలో ఉండే పోషక విలువలు మొత్తం నూనెలోకి వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నూనెను కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు కొంచెం కాటన్ లేదా ఇయర్ బడ్ తో ఈ నూనెను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పుచ్చిన గోళ్లపై అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

Toe Nail Fungus removing home remedies very effective
Toe Nail Fungus

ఇలా ఉదయం, సాయంత్రం రోజుకు రెండుసార్లు చొప్పున గోళ్లు పుచ్చిన చోట అప్లై చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే గోళ్లు పుచ్చిపోవడం తగ్గుతుంది. ముందుగా పుచ్చిన గోళ్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. పుచ్చిన గోళ్లు మొత్తం ఊడిపోయి ఆ స్థానంలో కొత్త గోళ్లు రావడం మొదలవుతాయి. గోళ్ల‌ లోపల ఉండే ఇన్ఫెక్షన్ కూడా తగ్గుముఖం పడుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now