Tanya Ravichandran : గాడ్ ఫాద‌ర్ సినిమాలో న‌య‌న‌తార చెల్లెలిగా న‌టించిన ఈమె ఎవ‌రో తెలుసా..?

October 6, 2022 6:14 PM

Tanya Ravichandran : తాన్యా ర‌విచంద్ర‌న్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. హీరో కార్తికేయ‌తో రాజా విక్ర‌మార్క అనే చిత్రంలో న‌టించిన‌ప్ప‌టికీ అంతగా గుర్తింపు రాలేదు. కానీ తాజాగా చిరంజీవి గాడ్ ఫాద‌ర్ సినిమాలో న‌య‌న‌తార చెల్లెలుగా న‌టించడంతో ఒక్క‌సారిగా అంద‌రి చూపు ఈమెపై ప‌డింది. మంచి అభిన‌యంతోపాటు చ‌క్క‌ని అందం ఆమె సొంతం అవ‌డంతో అంతా ఆమె గురించి ఆరా తీస్తున్నారు.

తాన్యా ర‌విచంద్ర‌న్ అస‌లు పేరు అభిరామి శ్రీరామ్. త‌మిళ ద‌ర్శ‌కుడు మిస్కిన్ ఈమెకు ఆ పేరును సూచించాడు. సీనియ‌ర్ త‌మిళ న‌టుడు ర‌విచంద్ర‌న్ కి మ‌న‌వ‌రాలు. త‌న వార‌సురాలిగా సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యింది. చెన్నైలో 1996 జూన్ 20 న శ్రీరామ్, లావ‌ణ్య దంప‌తుల‌కు జ‌న్మించింది. త‌న త‌ల్లి లావ‌ణ్య ద‌గ్గ‌ర భ‌ర‌త నాట్యంలో శిక్ష‌ణ తీసుకుంది. ఈమె త‌మిళంలో 6 సినిమాల్లో న‌టించింది. బ‌ల్లే వేళ్లాయెదేవా అనే సినిమా త‌మిళంలో త‌ను న‌టించ‌గా విడుద‌లైన మొద‌టి చిత్రం.

Tanya Ravichandran acted with Nayanthara in Godfather movie
Tanya Ravichandran

2017లో విజ‌య్ సేతుప‌తి, బాబీసింహ లాంటి వారితో క‌లిసి తాన్యా న‌టించిన క‌రుప్ప‌న్ అనే మూవీ ద్వారా ఆమెకు మంచి గుర్తింపు ల‌భించింది. హీరో కార్తికేయ సినిమా రాజా విక్ర‌మార్కతో తెలుగులో తెరంగేట్రం చేసింది. కానీ అంతగా పాపుల‌ర్ అవ్వ‌లేదు. కానీ గాడ్ ఫాద‌ర్‌ సినిమాలో న‌య‌న‌తార చెల్లెలుగా చేయ‌డంతో ఒక్క సారిగా అంద‌రి దృష్టి ఈమెపై ప‌డింది. ఈ చిత్రంలో ఆమె మంచి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమెకు తెలుగులో అవ‌కాశాలు పెరుగుతాయ‌ని ప‌లువురు త‌న భ‌విష్య‌త్తును తెలుపుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now