Unstoppable 2 : అన్‌స్టాప‌బుల్ 2 కోసం బాల‌య్య రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..? దిమ్మ తిరిగిపోతుంది..!

October 6, 2022 9:32 AM

Unstoppable 2 : నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ తొలిసారిగా బుల్లితెర‌పై చేసిన షో.. అన్‌స్టాప‌బుల్‌. ఈ షో మొద‌టి సీజ‌న్ బ్ర‌హ్మాండ‌మైన విజ‌యాన్ని సాధించింది. అన్ని ఎపిసోడ్లు చాలా ఆస‌క్తిక‌రంగా సాగాయి. ప‌లువురు న‌టీన‌టుల‌తో బాల‌య్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆహా ప్లాట్‌ఫామ్ పై వ‌చ్చిన ఈ షో ఎంతో మందిని అల‌రించింది. ఈ క్ర‌మంలోనే మొద‌టి సీజ‌న్ ఇచ్చిన జోష్‌తో రెండో సీజ‌న్‌ను మొద‌లు పెట్ట‌నున్నారు. అందులో భాగంగానే తాజాగా అన్‌స్టాప‌బుల్ 2 ట్రైల‌ర్‌ను కూడా లాంచ్ చేశారు. ఇందులో బాల‌య్య భిన్న‌మైన గెట‌ప్‌లో కనిపించి అద‌ర‌గొట్టేశారు.

ఇక అన్‌స్టాప‌బుల్ షో మొద‌టి సీజ‌న్‌కు గాను బాల‌య్య మొత్తంగా రూ.2.50 కోట్ల‌ను రెమ్యున‌రేష‌న్‌గా తీసుకున్న‌ట్లు తెలిసింది. అయితే మొద‌టి సీజ‌న్ స‌క్సెస్ కావ‌డంతో ఇప్పుడు రెండో సీజ‌న్‌కు బాల‌య్య ఇంకా ఎక్కువ మొత్తంలో రెమ్యున‌రేష‌న్ అందుకోనున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అన్‌స్టాప‌బుల్ 2కు మొత్తం రూ.10 కోట్ల‌ను రెమ్యున‌రేష‌న్‌గా అందుకోబోతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఇక‌ అన్‌స్టాప‌బుల్ 2 షో కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Unstoppable 2 Balakrishna remuneration
Unstoppable 2

కాగా అన్‌స్టాప‌బుల్ 2 మొద‌టి ఎపిసోడ్‌లో బాల‌య్య త‌న బావ నారా చంద్ర‌బాబు నాయుడుతో సంభాషించ‌నున్నారు. ఈ ఎపిసోడ్ దీపావ‌ళికి ప్ర‌సారం అవుతుంద‌ని స‌మాచారం. అలాగే ఈ సీజ‌న్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్, చిరంజీవి, వెంక‌టేష్ వంటి న‌టుల‌ను షోకు ర‌ప్పిస్తార‌ని తెలుస్తోంది. దీంతో మొద‌టి సీజ‌న్ క‌న్నా రెండో సీజ‌న్ అన్‌స్టాప‌బుల్ షో మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now