Sreeleela : మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల.. ఆ యంగ్ హీరోతో సినిమా..!

October 5, 2022 4:45 PM

Sreeleela : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ మూవీ పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా.. ఈ బ్యూటీ పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో శ్రీలీల అంటే యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అర‌డ‌జ‌నుకు పైగానే సినిమాలున్నాయి.

అలాగే బాలయ్య, మహేష్ బాబు, శర్వానంద్, నితిన్‌ సినిమాల్లో కూడా నటిస్తోంది అందాల భామ. ఇప్పటికే ఈ చిన్నదాని ఖాతాలో ఎన్నో క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న ధమాకాలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మూవీలో కూడా హీరోయిన్ గా చేస్తోంది శ్రీలీల. ఇంకా బాలకృష్ణ అనిల్ రావిపూడిలతోపాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీకి టాలీవుడ్ నుంచి మ‌రో క్రేజీ ఆఫ‌ర్ వచ్చింది.

Sreeleela got a chance in ram movie
Sreeleela

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అఖండతో సంచలన విజయాన్ని అందుకున్నాడు బోయపాటి. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను ఫైనల్ చేశారు. త్వ‌ర‌లో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందించనున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now