Rajamouli : నేనైతే ప్రభాస్ ని రాముడిగా అద్భుతంగా చూపించే వాడిని.. రాజమౌళి సంచలన కామెంట్స్..?

October 4, 2022 3:37 PM

Rajamouli : ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ఆదిపురుష్‌ టీజర్‌ను ఆదివారం అయోధ్యలో విడుదల చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ టీజర్‌ కొందరిని ఆకట్టుకుంటే మరికొందరిని నిరుత్సాహ పరచింది. అభిమానుల్లో కొందరు రోమాలు నిక్కబోడుచుకున్నాయని అంటుంటే.. మరి కొందరు కార్టూన్లతో సినిమా చేశారేంటి ? అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ నెటిజన్లు, అభిమానులే ఈ టీజర్‌ మీద కామెంట్‌ చేశారు. ఇప్పుడు సెలబ్రిటీలు కూడా ఆదిపురుష్‌ టీజర్‌ను కామెంట్‌ చేసే జాబితాలో చేరారు.

ప్రభాస్ లాంటి తోపు హీరోతో ఇలాంటి సినిమా తీయడం ఏంటి అంటున్నారు. అదే నేనైతే ప్రభాస్ ని రాముడి పాత్రలో అద్భుతంగా చూపించేవాడిని అంటూ రాజమౌళి కామెంట్స్ చేశారు. అసలు ప్రభాస్ లాంటి తోపు హీరోని పెట్టుకుని కూడా ఇలాంటి భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో చూపించడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ప్రజంట్ ఈ కామెంట్స్ పరోక్షంగా ఓం రౌత్ పై ఎఫెక్ట్ చూపించనున్నాయట. టీజర్‌ విడుదలైన 2 గంటల తర్వాత రాజమౌళి సోదరుడు నటుడు, రచయిత ఎస్‌.ఎస్‌.కాంచీ ఈ విషయం మీద ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు.

Rajamouli reportedly commented on Adipurush teaser
Rajamouli

పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి అంటూ కామెంట్‌ చేశారు. అయితే కాంచీ ఎక్కడా పేరును ప్రస్తావించలేదు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడాయన ట్వీట్‌ పై పలువురు భిన్నంగా స్పందించారు. అయితే కొంతమంది నెటిజన్లు ప్రభాస్ ను రాముడిగా చూపించాలంటే అది రాజమౌళికే సాధ్యం అంటూ కామెంట్ చేస్తున్నారు. రామాయణం ఆధారంగా తీసిన ఆదిపురుష్ ను వచ్చే ఏడాది జనవరి 12 న రిలీజ్ చేయనున్నారు. మరి టీజర్ విషయంలోనే ఈ రేంజ్ లో కామెంట్స్ వస్తే.. నెక్ట్స్ ట్రైలర్ రిలీజ్ అయితే కామెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అనే టాక్ కూడా వినిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now