Anasuya : మా ఆయన ఊళ్ళో లేడు.. బెడ్ పై ఒంటరిగా నిద్రపోవాల్సి వస్తుందంటూ అనసూయ సంచలన వీడియో..!

October 3, 2022 4:07 PM

Anasuya : బుల్లితెరపై యాంకర్‌గా పరిచయమై.. ఇప్పుడు వెండితెరపై ఆర్టిస్ట్‌గా మారిన అనసూయ భరద్వాజ్ గురించి తెలిసిందే. సినిమాల్లో ఏ క్యారెక్టర్‌ అయినా ఓకే అంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న అనసూయ తన ప్రతి ఫీలింగ్‌ని, మూమెంట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్ల కామెంట్లను, కాంట్రవర్సీ పోస్ట్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల ఆంటీ అంటూ తనను ట్రోలింగ్ చేసిన నెటిజన్లకు యాంక‌ర్ అనసూయ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుంది. అంతేకాకుండా వాళ్ల మీద పోలీస్ కంప్లైంట్స్ కూడా ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.

అన‌సూయ సోషల్ మీడియాలో ఎప్పుడు గ్లామర్ ఫొటోలతో ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది. కానీ కొద్దిరోజులుగా డ్యాన్స్ వీడియోల‌తో దర్శనమిస్తూ ర‌చ్చ చేస్తుంది. మహేశ్ బాబు ఒక్కడు మూవీలోని నువ్ ఏ మాయ చేశావో గానీ అనే పాటకు స్టెప్పులేసింది ఆకట్టుకుంది. అయితే తాజాగా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియోని షేర్ చేసుకుంది. ఆ వీడియోలో ఆమె తన బెడ్ రూమ్ లో బెడ్ పై పడుకొని తన పక్కన భర్త లేని విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. నాకు నేనే గుడ్ నైట్ చెప్పుకుంటున్నాను అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.

Anasuya latest post she said she is missing her husband
Anasuya

బెడ్ పై పడుకున్నా అనసూయ పక్కన ఖాళీగా ఉన్న భరద్వాజ్ ప్లేస్ ని చూపిస్తూ.. ఆ వీడియోకి కామెంట్ చేస్తూ.. ఇంట్లో ఆయన లేకపోతే గుడ్ నైట్ నాకు నేనే చెప్పుకోవాలి. ఒంటరిగా నిద్రపోవాల్సి వస్తుంది అంటూ రాసుకొచ్చింది. దీంతో అనసూయ ఫ్యాన్స్ సైతం మండి పడుతున్నారు. ప్రైవేట్ వీడియోని పబ్లిక్ గా పోస్ట్ చేయడం అవసరమా అనసూయ అని కొందరంటుంటే.. మరికొందరేమో ఏంటీ పిచ్చి పనులు అనసూయ.. నువ్వు ఇలాంటి విషయాలు షేర్ చేయకు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వకు అంటూ హితబోధ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అనసూయ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆమెను ఓ రేంజ్ లో ఆడేసుకుంటుంటే.. ఇవన్నీ అనసూయకు మాములేలే అని కొందరు లైట్ తీసుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now