Cinnamon Powder : దాల్చిన చెక్క‌ను ఇలా 3 నెల‌లు తీసుకుంటే.. శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రుగుతుంది..

October 4, 2022 7:56 AM

Cinnamon Powder : సుగంధ ద్రవ్యాలకు రాణి దాల్చినచెక్క. దాల్చిన చెక్క లేని భారతీయ వంటగది దాదాపు ఉండదు. బిర్యానీ చేసేటప్పుడు సైతం దాల్చిన చెక్క ఉండాల్సిందే. లేదంటే బిర్యానికి ఉండవలసిన రుచి ఉండదు. దాల్చిన చెక్కను అలాగే తింటే కొంత తీపి, కొంత‌ ఘాటు కలిసినట్టుగా అనిపిస్తుంది. మంచి సుగంధ వాసనను కూడా దాల్చిన చెక్క విడుదల చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా దాల్చిన చెక్కకు ఎంతో ప్రముఖమైన స్థానం ఉంది. దాల్చిన చెక్కను నిత్యం ఆహారంలో తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.

దాల్చిన చెక్కలో మన శరీరానకి సహాయపడే 41 సమ్మేళనాలు ఉంటాయి. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో చెడు కొలస్ట్రాల్ ను తొలగించి మంచి కొలస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. కడుపులో ఏదైనా సమస్య ఉంటే దాల్చిన చెక్క వెంటనే తగ్గిస్తుంది. కడుపులో నొప్పి, ఉబ్బరంగా లేదా మలబద్దక సమస్యను దాల్చిన చెక్కతో వెంటనే నయం చేసుకోవచ్చు. మధుమేహంతో బాధపడేవారికి దాల్చిన చెక్క ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా తగ్గిస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఇన్సులిన్ ను కూడా పెంచుతుంది.

amazing health benefits of Cinnamon Powder
Cinnamon Powder

బరువు తగ్గాలని అనుకునేవారు దాల్చిన చెక్కను వాడితే కొవ్వు నిల్వ ప్రక్రియలో పాల్గొనే అణువులను తగ్గించడం ద్వారా కొవ్వును కరిగిస్తుంది. దాంతో అధిక బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. అధిక బరువును నియంత్రించడానికి ఈ చిట్కా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి అందులో ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం పూట ఖాళీ కడుపుతో సేవించాలి. ఇలా మూడు నెలల పాటు చేస్తే చాలా సులభంగా ఎలాంటి వ్యాయామాలు చేయకుండానే బరువు తగ్గుతారు.

అంతేకాకుండా దాల్చిన చెక్క టీ ని తాగటం వలన కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. దాల్చిన చెక్కలో ఉండే సమ్మేళనాలు అలనిన్ అనే ఎంజైమ్ ను శరీరంలో నిల్వ ఉండకుండా తొలగిస్తాయి. దీని వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. చూశారా.. దాల్చిన చెక్క వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. అందుకే ఏ ఆహార పదార్థాలలోనైనా దాల్చిన‌చెక్క వేస్తే తీసి పక్కన పెట్టకుండా తినడం వల్ల ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు కలుగుతాయ‌ని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now