NTR : ఎన్‌టీఆర్‌, త్రివిక్ర‌మ రావు.. ప్రాణానికి ప్రాణంగా ఉండేవారు.. అలాంటిది వారు ఓ ద‌శ‌లో ఎందుకు విడిపోయారు..?

October 3, 2022 6:12 PM

NTR : సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోగానే కాకుండా రాజ‌కీయాలో కూడా త‌న‌దైన ప్రతిభను చాటుకున్నారు నందమూరి తారక రామారావు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజ‌కీయాల్లో తిరుగులేని వ్య‌క్తిగా ఎదిగారు. ఎన్నో ప‌థ‌కాల ద్వారా పేద ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించి చ‌రిత్ర‌లో తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేని సీఎంగా చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్ కు కుటుంబం అంటే అమితమైన ప్రేమ. నాతో పాటు నా కుటుంబీకులు కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తి ఎన్టీఆర్. ఆయన స్టార్ హీరోగా ఎదుగుతూనే తన సొంత తమ్ముడైన త్రివిక్రమ్ రావుని నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అన్నగారు అంటే త్రివిక్రమరావుకు కూడా ఎంతో గౌరవం ఉండేది. సాధార‌ణంగా ప్రస్తుత సమాజంలో అన్న‌ద‌మ్ములు అంటే ఆస్తుల కోసం గొడ‌వ‌లు ప‌డ‌టం లాంటివే చూస్తుంటాం. కానీ ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ రావుల అనుబంధం చూస్తే రామ‌ల‌క్ష్మణులను తలపించేలా ఉంటుంది.

బంధువులే కాకుండా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ స‌న్నిహితులు కూడా త్రివిక్ర‌మ్ రావు, ఎన్టీఆర్ ల అనుబంధాన్ని గురించి గొప్ప‌గా చెబుతుంటారు. ఎన్టీఆర్ హీరోగా, సీఎంగా అందరికీ చాలా బాగా తెలుసు. కానీ త్రివిక్ర‌మ్ రావు గురించి పెద్ద‌గా బయట ఎవరికీ తెలియ‌దు. త్రివిక్ర‌మ్ రావు సినిమాలు నిర్మిస్తున్న క్ర‌మంలో తమ్ముడికి ఎన్టీఆర్ స‌హాయ‌స‌హ‌కారాలు అందించేవారు. ఎన్టీఆర్ సినిమాల్లోకి వెళ్లిన స‌మ‌యంలో అన్నకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్రివిక్ర‌మ్ రావు కుటుంబ బాధ్యతలు మొత్తం చూసుకునేవారు. కుటుంబాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను మీరు చెన్నైకి వెళ్లి సినిమా ప్రయత్నాలు చేయండని అన్నయ్యకు ధైర్యం చెప్పి పంపించారు త్రివిక్రమ్ రావు.

why NTR and his brother Trivikrama Rao separated at some time
NTR

ఎన్టీఆర్ స్టార్ గా ఎదిగిన తర్వాత సొంత బ్యాన‌ర్ అయిన‌ విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై మాత్ర‌మే కాకుండా బ‌య‌ట బ్యాన‌ర్ నుండి మంచి సినిమా అవకాశాలు వ‌చ్చినా ఎన్టీఆర్ ను చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చేవారట త్రివిక్రమ్ రావు. ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ రావు శ‌రీరాలు వేరైనా ప్రాణాలు మాత్రం ఒక్కటే అన్నట్లు ఉండేవారట. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించిన త‌ర‌వాత కూడా త్రివిక్ర‌మ్ రావు పార్టీ వ్య‌వ‌హార‌ల‌ను కూడా చూసుకునేవారు. ఎన్టీఆర్ రెండో సారి సీఎం అయిన త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య ఓ సమస్య వ‌చ్చింద‌ట‌.

దాంతో త్రివిక్ర‌మ్ రావు ఎన్టీఆర్ కు కొంత కాలం దూరం అయ్యారట. పార్టీకి తెలియ‌కుండా పార్టీ పేరుపై 20వేల రూపాయ‌ల వ‌ర‌కూ విరాళాలను వసూలు చేశార‌ట‌ త్రివిక్రమ్ రావు. ఆ విష‌యం ఎన్టీఆర్ కు బ‌య‌టి వ్య‌క్తుల ద్వారా తెలియడంతో త‌మ్ముడైన నువ్వు నాకు చెప్ప‌కుండా అలా ఎందుకు విరాళాలు వసూలు చేశావంటూ ఎన్టీఆర్ తమ్ముడిపైన సీరియ‌స్ అయ్యార‌ట‌. ఆ విరాళాల‌ను కార్య‌క‌ర్త‌ల సంక్షేమ నిధి కోసం వసూలు చేశార‌ట‌ త్రివిక్రమ్ రావు. ఆ త‌రువాత అన్నదమ్ములిద్దరూ చాలా కాలం పాటూ మాట్లాడుకోలేదట. కానీ ఆ త‌రువాత అన్నదమ్ములిద్దరూ మ‌ళ్లీ ఒకటైపోయారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now