Today Gold Rate : గుడ్‌ న్యూస్‌.. బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు..!

October 3, 2022 8:22 AM

Today Gold Rate : గత కొంత కాలంగా అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ధరల్లో భారీగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి. కొద్ది రోజులు బంగారం ధర పైపైకి వెళ్తుంది. తరువాత భారీగా పతనమవుతుంది. అయితే పసిడి కొనాలని అనుకునే వారికి ప్రస్తుతం మంచి సమయం అని చెప్పవచ్చు. ఇక అక్టోబర్‌ 3 సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్‌, ముంబై, కోల్‌కతా, కేరళ, భువనేశ్వర్‌, విశాఖపట్నం ప్రాంతాల్లో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,730గా ఉంది. అలాగే చెన్నైలో రూ.46,900, రూ.51,160గా బంగారం ధరలు ఉన్నాయి.

Today Gold Rate on October 3rd 2022 in India
Today Gold Rate

ఇక ఢిల్లీలో రూ.46,650, రూ.50,890, బెంగళూరులో రూ.46,550, రూ.50,780, నాగ్‌పూర్‌లో రూ.46,530, రూ.50,760 గా బంగారం ధరలు ఉన్నాయి. అలాగే వెండి ధరల విషయానికి వస్తే.. కిలో వెండి ధర చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, విశాఖపట్నంలలో రూ.62వేలు ఉండగా, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, నాగ్‌పూర్‌లలో రూ.56,900గా ఉన్నాయి.

ఇక అక్టోబర్ 2వ తేదీతో పోలిస్తే వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే బంగారం ధరల్లోనూ ఎలాంటి మార్పులు లేవు. కొద్ది రోజుల వరకు ఇలాగే ధరలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కనుక బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now