OTT : ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు ఈ వారం పండ‌గే.. అద్భుత‌మైన సినిమాలు వ‌స్తున్నాయి..!

October 3, 2022 8:09 AM

OTT : ప్ర‌తి శుక్ర‌వారం విడుద‌ల‌య్యే సినిమాలు, సిరీస్ ల కోసం ఓటీటీ ప్రేక్ష‌కులు ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తూ ఉంటారు. ప‌లు సినిమాల తేదీలు తెలుసుకొని వాటిని వీక్షించ‌డానికి సిద్ధ‌మైపోతుంటారు. అలాగే ఈ వారం కూడా థియేట‌ర్ల‌లో విజ‌య‌వంత‌మైన సినిమాలు కొన్ని ఓటీటీ విడుద‌ల‌కు రెడీ అయిపోయాయి. వీటితో ద‌స‌రా పండుగ మ‌రింత క‌ళ సంత‌రించుకోనుంది. ఇక ఈ వారం ఓటీటీల‌లో రాబోయే సినిమాలు, సిరీస్ ల గురించి తెలుసుకుందాం.

నిఖిల్ సిద్ధార్థ, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరో హీరోయిన్లుగా న‌టించ‌గా మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా విడుద‌లై పాన్ ఇండియా బాక్సాఫీస్ దుమ్ము రేపిన కార్తికేయ 2 సినిమా జీ 5 ఓటీటీలో అక్టోబ‌ర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీంతో వారికి ఎట్ట‌కేల‌కు వినోదం ల‌భ్యం కానుంది.

movies releasing on OTT apps on 7th October 2022
OTT

అలాగే నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సోషియో ఫ్యాంట‌సీ చిత్రం బింబిసార‌ కూడా జీ5 లో అక్టోబ‌ర్ 7 నుండి ప్ర‌సారం కానుంది. క్యాథ‌రీన్ ట్రెసా, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా చాలా కాలం త‌రువాత‌ క‌ళ్యాణ్ రామ్ కు మంచి విజ‌యాన్ని అందించింది. ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని బాగా ఆక‌ట్టుకుంది. అయితే ఈ మూవీ థియేట‌ర్ల‌లో భారీ విజ‌యాన్ని సాధించింది. క‌నుక ఓటీటీలో కూడా బంప‌ర్ హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నారు.

అశీష్ గాంధీ, చిత్ర శుక్లా జంట‌గా న‌టించిన ఉనికి అనే సినిమా అక్టోబ‌ర్ 5 నుండి ఆహా ఓటీటీ లో ప్ర‌ద‌ర్శితం కానుంది. ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా గురించి అంత‌గా తెలియ‌క పోయినా రేటింగ్ మాత్రం బాగానే ఉంది. క‌నుక ఈ మూవీని కూడా ప్రేక్ష‌కులు చూడ‌వ‌చ్చు. అలాగే బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టించిన ర‌క్షాబంధ‌న్ అనే మూవీ జీ5 ఓటీటీలో అక్టోబ‌ర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ తో ఆగ‌స్టు 11న‌ హిందీలో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యాన్ని చూసింది.

అంతే కాకుండా ఈషో అనే మ‌ళ‌యాళ‌ థ్రిల్ల‌ర్ సినిమా కూడా అక్టోబ‌ర్ 5 నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. సైన్స్ ఫిక్ష‌న్, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ అయిన ఇంగ్లీష్ చిత్రం ప్రే.. డిస్నీ హాట్ స్టార్ లో అక్టోబ‌ర్ 7 నుండి ప్ర‌సారం కాబోతుంది. ఇలా ప‌లు భారీ యాక్ష‌న్‌, థ్రిల్ల‌ర్ మూవీలు ఈ వారం ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత వినోదాన్ని అందించ‌నున్నాయి. దీంతో పండుగ వేళ ఓటీటీలు క‌ళ‌క‌ళ‌లాడ‌నున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now