Puri Jagannadh : పూరీ జగన్నాథ్‌ సినిమాలను వదులుకున్న టాలీవుడ్ హీరోలు..!

October 2, 2022 10:51 PM

Puri Jagannadh : డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈయన సినిమాలో కథ పెద్దగా ఉండదు. కానీ హీరో బాడీ లాంగ్వేజ్, అలాగే హీరో క్యారెక్టరైజేషన్ తో సినిమాని నడిపిస్తాడు. స్క్రీన్ ప్లే కూడా మంచి స్పీడ్ గా ఉంటుంది. తమ హీరోని పక్కా కమర్షియల్ యాంగిల్ లో చూసి దమ్మున్న డైలాగులు పలకాలి అంటే, అది పూరీ డైరెక్షన్ లోనే కుదురుతుంది అని బలంగా నమ్ముతారు. ఇది ఇలా ఉంటే పూరీ జగన్నాథ్ ఒక హీరోతో చేయాలనుకున్న సినిమాను వేరే హీరోలు చేసిన దాఖలాలు ఉన్నాయి ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లైగర్ కథను 2016లో ఎన్టీఆర్ కు చెప్పాడట. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నిర్మించాలని కూడా పూరీ ప్లాన్ చేసుకున్నాడు. బాక్సర్ అన్న టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. అయితే అప్పటికే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బ్యానర్ లో బాబీ హీరోగా జై లవకుశ సినిమా చేయాలని అనుకున్నాడు. దీంతో లైగర్ సినిమా కథ ఏదో తేడా కొడుతుండటంతో ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేశాడు. ఒకవేళ ఎన్టీఆర్ లైగర్ సినిమా చేసి ఉంటే ఎన్టీఆర్ ఖాతాలో మరో పెద్ద డిజాస్టర్ సినిమా వచ్చి ఉండేది.

Puri Jagannadh  movies rejected telugu heroes
Puri Jagannadh

ఇడియట్ సినిమాను మొదట పవన్ కళ్యాణ్ తీయాలని అనుకున్నాడు పూరీ. పండు గాడుగా పవన్ కళ్యాణ్ ని పెట్టాలనుకున్నాడు పూరీ. కానీ మహేష్ తో ఈ సినిమా చేశాడు. లైగర్‌ మూవీని మహేష్‌బాబుతో పూరీ చేయాలని అనుకున్నాడు. కానీ లైగర్ స్క్రిప్ట్‌ కు మహేష్‌ నో చెప్పాడు. పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జన గణ మనను మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేస్తున్నాడు. ఎన్టీఆర్‌ తో ఇస్మార్ట్ శంకర్‌ చేయాలని అనుకుని రామ్ తో చేశాడు.

పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జన గణ మనను సూర్యతో కూడా చేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేస్తున్నాడు. పూరీ తన కొడుకుతో ఇస్మార్ట్ శంక‌ర్‌ సినిమా తీయాలని భావించాడు కానీ చివరికి రామ్ పోతినేనితో చేశాడు. బిజినెస్‌ మెన్‌ సినిమాను మొదట సూర్యతో చేయాలని అనుకుని.. మహేష్‌ తో తీశాడు. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయిని రవితేజ కంటే ముందు శ్రీరామ్ హీరోగా చేయాలని అనుకున్నాడు పూరీ. కానీ ర‌వితేజ‌తో చేసి హిట్ కొట్టాడు. ఇలా పూరీ అనుకున్న సినిమాల‌ను మొద‌ట తాను చేయాల‌నుకున్న హీరోల‌తో కాకుండా వేరే హీరోల‌తో చేయ‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now