Onions : ప‌చ్చి ఉల్లిపాయ తింటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

October 2, 2022 7:33 PM

Onions : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెతను మనం చాలాసార్లు వినే ఉంటాం. పల్లెటూరిలో చాలా మంది ఉదయాన్నే చద్దన్నంతో పచ్చి ఉల్లిపాయ తింటూ ఉంటారు. ఉల్లిపాయలో ఉన్న సహజ ఔషధాలు, పోషకాల వల్ల మన పెద్దలు ఈ సామెతను చెబుతూ ఉంటారు. వీటిలో అనేక ఔషధాలతోపాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు, సల్ఫర్‌ లాంటివి కూడా ఉల్లిలో ఉన్నాయి. ఉల్లిపాయ గురించి ఇన్ని విషయాలు చాలా మందికి తెలియక పోయినా.. ఉల్లిని ప్రతి ఒక్కరూ నిత్యం ఆహారంలో ఉపయోగిస్తుంటారు. ఉల్లి లేని ఇల్లు అసలు ఇల్లు కాదనే చెప్పొచ్చు. ఉల్లిపాయ లేకుండా కూర చేయడం మాత్రం అస్సలు జరిగే పనే కాదు. కేజీ ఉల్లిపాయ ధర 100 రూపాయలు ఉన్నా కూడా ఇంటిలో ఉల్లిపాయి ఉండవలసిందే.

ఉల్లిపాయలో ఉండే థియోసల్ఫినేట్‌ రక్తం పలుచగా ఉండేలా చేయటం వలన గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాల నుంచి కాపాడుతుంది. కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు, దంతాలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఉల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

if you are eating Onions then you should know these things
Onions

ఉల్లిపాయలో ఉండే సెలీనియం విటమిన్ ఇ ని ఉత్పత్తి చేస్తుంది. ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు ఏర్పడే ఘాటుతనం కంటి సమస్యలను తగ్గిస్తుంది. ఎందుకంటే నేచురల్ ఐ డ్రాప్స్‌లో ఉల్లిపాయ రసం కూడా ఉంటుంది. ఆడవారికి మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలను తగ్గించటంలో ఉల్లిపాయ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.  మధుమేహం, గుండె మరియు క్యాన్సర్ సమస్యలు రాకుండా కాపాడుతుంది.

ఉల్లిపాయలలో ఉండే క్వెర్సెటిన్ మరియు సల్ఫర్ సమ్మేళనాలు డయాబెటిస్ ను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. ఉల్లిపాయలో ఫైబర్ మరియు ప్రీబయోటిక్స్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంధ‌ సమస్యల నుంచి బయటపడవచ్చు. అందుకే ఉల్లిపాయలను కూరల్లో వేసే కన్నా పచ్చిగా తింటే మేలు కలుగుతుందని వైద్య నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now