Meena : భ‌ర్త మ‌ర‌ణం త‌రువాత మీనాలో చాలా మార్పు.. ఇలా అయిపోయిందేమిటి..?

October 1, 2022 11:33 AM

Meena : ఒకప్పుడు టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన కోలీవుడ్ బ్యూటీ మీనా. మీనా స్వతహాగా మళ‌యాళ సినీ పరిశ్రమకు చెందినది అయినప్పటికీ టాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది. ఈ క్రమంలో మీనా నటించిన పలు లవ్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు సినీ ప్రేక్షకులను కట్టి పడేశాయి. అయితే రీసెంట్ గా భర్తను కోల్పోయిన మీనా కొన్నాళ్ళు ఇంటికే పరిమితమయ్యింది. ఈమధ్యే మళ్ళీ సినిమా షూటింగ్స్ కూడా స్టార్ట్ చేసింది.

తనకు ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన రంభ, సంఘవి, సంగీత లాంటి స్టార్స్ ఫ్యామిలీస్ తో కలిసి మీనా ఇంటికి వెళ్లారు. అక్కడ వారు సందడి చేసిన విషయం తెలిసిందే. అలాగే మీనా ఇటీవల తన 46వ పుట్టినరోజును ప్రాణస్నేహితుల మధ్య గ్రాండ్ గా జరుపుకుంది. మీనా ఇప్పుడిప్పుడే తన భర్త మరణం నుంచి బయటపడుతూ సాధారణ వ్యక్తిలా మారిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా మీనా తన స్నేహితురాలితో కలిసి ఫారెన్ వెకేషన్ లో ఉంది.

Meena first time came outside after her husband death
Meena

మీనా తన స్నేహితురాలు స్టైలిస్ట్ రేణుక ప్రవీణ్ తో కలిసి విదేశాల్లో పలు ప్రదేశాల్లో తీసుకున్నటు వంటి ఒక రీల్ వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈమె ఫారిన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇవి చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీనా తన భర్త మరణం నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఈమెను ఇలా సంతోషంగా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, మీనా ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now