Baahubali : బాహుబ‌లి మూవీలో ఆ పాట‌ల‌కు అంత ఖ‌ర్చు చేశారా.. వామ్మో..!

October 1, 2022 9:59 AM

Baahubali : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రాలు ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రెండు పార్ట్‌లుగా వ‌చ్చిన ఈ మూవీ అఖండ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. నిర్మాత‌ల‌కు కాసుల పంట‌ను కురిపించింది. రెండు మూవీల‌కు క‌లిపి సుమారుగా రూ.500 కోట్ల బ‌డ్జెట్ కాగా.. రూ.2000 కోట్ల వ‌ర‌కు ఈ మూవీలు వ‌సూలు చేయ‌డం విశేషం. ఈ మూవీలో ప్ర‌భాస్ ద్విపాత్రాభిన‌యంతో అల‌రించాడు. అలాగే భ‌ల్లాల దేవుడి పాత్ర‌లో రాణా ఆకట్టుకున్నాడు. ఇక అనుష్క శెట్టి, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్‌, కిచ్చ సుదీప్ వంటి వారు అద్భుతంగా న‌టించారు. అలాగే క‌ట్ట‌ప్ప పాత్ర చేసిన స‌త్య‌రాజ్‌కు కూడా బాగానే పేరు వ‌చ్చింది.

బాహుబ‌లి సినిమాల ద్వారా రాణా, ప్ర‌భాస్‌లు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. దీంతో వారి సినిమాల‌కు క్రేజ్ ఏర్ప‌డింది. అయితే బాహుబ‌లి సినిమాలు వ‌చ్చి అన్ని సంవ‌త్స‌రాలు అవుతున్నా.. ఇప్ప‌టికీ వీటి గురించి ఏదో ఒక విష‌యం బ‌య‌ట ప‌డుతూనే ఉంది. తాజాగా ఈ మూవీలోని పాట‌కు చెందిన వివ‌రాలు వైర‌ల్ అవుతున్నాయి. బాహుబ‌లి మొద‌టి పార్ట్‌లో అవంతిక‌ను వెదుకుతూ శివుడు అలియాస్ మ‌హేంద్ర బాహుబ‌లి వెళ్తాడు. ఆ స‌మ‌యంలో ఒక సాంగ్ వ‌స్తుంది. ఆ త‌రువాత ఇద్ద‌రూ క‌ల‌సిపోతారు. అప్పుడు ఇంకో పాట వ‌స్తుంది. అయితే ఈ పాట‌ల‌కు చెందిన బ‌డ్జెట్ వివ‌రాలే దిమ్మ‌తిరిగిపోయేలా ఉన్నాయి.

do you know the making cost of these two Baahubali songs
Baahubali

అప్ప‌ట్లో ఈ రెండు పాట‌ల‌కు ఒక్కో దానికి రూ.2.50 కోట్ల చొప్పున రూ.5 కోట్లు ఖ‌ర్చు చేశార‌ట‌. కేవ‌లం పాట‌ల‌నే అత్యంత అద్భుత‌మైన గ్రాఫిక్స్ తో రూపొందించారు. క‌నుక‌నే ఆ పాట‌లు ఆ స్థాయిలో ఫేమ‌స్ అయ్యాయి. ధీవ‌రా.. అనే పాట‌తోపాటు ప‌చ్చ బొట్టేసినా.. అనే సాంగ్‌.. ఈ రెండూ క‌లిపి రూ.5 కోట్ల మేర ఖ‌ర్చు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అప్ప‌టి ఆ పాట‌ల‌కు చెందిన విష‌యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now