Kerala Auto Driver : లాట‌రీలో రూ.25 కోట్లు గెలుచుకున్న ఆటో డ్రైవ‌ర్‌.. అత‌ని ప‌రిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే..?

September 25, 2022 8:37 AM

Kerala Auto Driver : కేరళలో ప్రభుత్వం మెగా ఓనం లాటరీలో రూ. 25 కోట్లు గెలిచాడు ఓ ఆటో డ్రైవర్. దీంతో ఈ విషయం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఓ సాధారణ ఆటో డ్రైవర్ లాటరీలో ఇన్ని కోట్లు గెలవడం ప్రజల్ని ఆకర్షించింది. అయితే ఇప్పుడు ఆ లాటరీ విన్నర్ అనూప్ బాధపడుతున్నాడు. నేను ఎందుకు లాటరీని గెలిచానని.. గెలవకుంటే బాగుండేదని భావిస్తున్నాడు. నేను మనశ్శాంతిని కోల్పోయాను.. ప్రస్తుతం నేను నా సొంత ఇంటిలో కూడా నివసించలేకపోతున్నానని ఆయన వాపోతున్నాడు. నేను లాటరీ గెలిచినప్పటి నుంచి ప్రజలు వాళ్ళ సమస్యలు చెబుతూ.. అవసరాలు తీర్చమని నన్ను అడగడానికి వస్తున్నారని.. నేను ఇంటికి వచ్చే వారితో ఇబ్బంది పడుతున్నాను అన్నాడు అనూప్.

రూ.25 కోట్ల లాటరీలో ప‌న్ను, ఇతర బకాయిలు అన్ని మిన‌హాయింపులు పోయిన త‌రువాత ఆయ‌నకు ప్రైజ్ మనీగా రూ. 5 కోట్లు రానున్నాయి. అంత పెద్ద మొత్తంలో డ‌బ్బులు వ‌స్తున్నా.. తాను ఇప్పుడు మ‌న‌శ్శాంతిని కోల్పోయానని చెపుతున్నాడు. ఈ విషయాన్ని జీ న్యూస్ లో ప్రచురించింది. నేను ఆ డబ్బులు గెలవకుంటే ఉంటే బాగుడేందన‌ని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. చాలా మందిలాగే నేను కూడా 1, 2 రోజులు వార్త‌ల్లో నిలిచినందుకు నిజంగా ఆనందించాను. కానీ ఇప్పుడు అదే ప్రమాదంగా మారింది. ఆ డబ్బును ఏమి చేయాలో నేను ఇంకా నిర్ణయించుకోలేదు.

Kerala Auto Driver who won rs 25 crores in lottery see what he is doing now
Kerala Auto Driver

ప్రస్తుతానికైతే ఆ డ‌బ్బుని రెండేళ్ల పాటు బ్యాంకులో వేస్తాను. అయితే ఇంత పెద్ద మొత్తంలో ప్రైజ్ మ‌నీ ఉండే బదులు కొంత త‌క్కువ‌గానే ఉంటే బాగుండేది అనిపిస్తోందని ఆయన అన్నాడు. తనకు తెలిసిన చాలా మందే ఇప్పుడు శత్రువులుగా మారే అవ‌కాశం ఉంద‌ని అనూప్ వాపోయాడు. నన్ను వెతుక్కుంటూ చాలామంది వస్తున్నారు. మా ఇంటి చుట్టుప‌క్క‌లే తిరుగుతున్నారు. దీంతో మా ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలుగుతుంది. దీంతో వారు కూడా ఇప్పుడు నాపై కోపంగా ఉన్నారు. నా మనశ్శాంతి అంతా పోయింది అని అనూప్ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now