Naga Chaitanya : శోభితపై తన ప్రేమను మరోసారి వ్యక్తం చేసిన చైతూ.. ఇదిగో ప్రూఫ్..!

September 23, 2022 2:50 PM

Naga Chaitanya : టాలీవుడ్ లో సెలబ్రెటీ జంటగా ఉన్న‌ సమంత, నాగ చైతన్య గత సంవత్సరం విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇచ్చారు. విడాకుల అనంతరం ఇద్దరూ సినిమాల్లో బిజీ అయిపోయారు. అయితే గత కొంతకాలంగా నాగచైతన్య శోభిత ప్రేమలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. చైతన్య, శోభితలకు ఓ కామన్ ఫ్రెండ్ ఉన్నాడని ఆ వ్యక్తి పుట్టినరోజు వేడుకల్లో చైతన్య శోభిత కలిశారని సమాచారం. ఆ పరిచయం స్నేహంగా మారిందని తెలుస్తోంది. సమంత కూడా వీరి జంటను టార్గెట్ చేసి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే శోభిత కూడా ఇన్‌స్టాగ్రామ్ లో మిడిల్ ఫింగర్ చూపిస్తూ పోస్ట్ చేసింది. రూమర్స్ కి శోభిత కౌంటర్ అంటూ ప్రచారం జరిగింది. కానీ మరోసారి వీరిద్దరి గురించి న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే.. శోభిత ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వం 1లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఆమె ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. చోళుల కాలం నాటి కథ కాబట్టి శోభిత యువరాణి గెటప్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు వానతి.

Naga Chaitanya again liked Sobhitha post
Naga Chaitanya

తన ఫస్ట్ లుక్ ని శోభిత ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. దానికి నాగచైతన్య లైక్ కొట్టాడు. ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్ లో ఈ కథనం వెలువడింది. నాగ చైతన్య లైక్ చేసినట్లుగా స్క్రీన్ షాట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. వారిపై వస్తున్న ఈ వార్తలపై చైతూ, శోభిత ఎలా స్పందిస్తారో చూడాలి. శోభిత ధూళిపాళ్ల తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మేజర్, గూఢచారి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం చైతూ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now