తియ్య తియ్యని బనానా డోనట్స్ తయారీ విధానం

June 19, 2021 1:02 PM

ఎంతో రుచికరమైన బనానా డోనట్స్ అంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే పేరు వినడానికి కష్టంగా ఉన్నా ఈ రెసిపీ చేయడం ఎంతో సులువు,అదేవిధంగా తినడానికి కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. మరి తియ్యగా ఉండే ఈ బనానా డోనట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

banana dough nuts making

కావలసిన పదార్థాలు

*అరటి పండ్లు 2 పండినవి

*గోధుమపిండి ఒకటిన్నర కప్పు

*చక్కెర అరకప్పు

*ఉప్పు చిటికెడు

*కోడిగుడ్లు రెండు

*బేకింగ్ సోడా తగినంత

*వెనీలా ఎక్స్ ట్రాక్ట్ ఒక టీ స్పూన్

*బటర్ పావు కప్పు (కరిగినది)

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలోకి అరటి పండ్లను మెత్తని గుజ్జులా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గిన్నెలోకి పంచదార, ఉప్పు, వెనీలా ఎక్స్ ట్రాక్ట్ వేసి బాగా కలియబెట్టాలి. ఆ తరువాత బేకింగ్ పౌడర్ కరిగించిన బటర్ వేసుకొని కలిపి ఆ తరువాత గోధుమపిండి కొద్దికొద్దిగా వేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని డోనట్ మేకర్ లో పాన్ పెట్టి కొద్దిగా నూనె రాసి ముందుగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా అందులో వేసి స్విచ్ ఆన్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బనానా డోనట్స్ తయారయినట్టే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now